ఐటీ రంగం కుదేలవ్వడానికి కారణాలేంటి?

by Disha edit |
ఐటీ రంగం కుదేలవ్వడానికి కారణాలేంటి?
X

వివిధ దేశాల మాంద్యం ప్రభావం మన దేశంపై ఉండకపోవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో మాంద్యం నుంచి కోలుకున్నా ఈసారి పరిస్థితి అలా ఉండదనే భావన ఉంది. ఖర్చు తగ్గించుకోవడం లో భాగంగా ఆటోమేషన్, రోబోటైజేషన్ వైపు ఐటీ రంగం మళ్లే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఐటీ ఉద్యోగుల మనుగడ, కొత్త కొలువులు కష్టమవుతాయి. ఈ పరిస్థితుల కారణంగానే. దేశ జీడీపీ 7.5 గా అంచనా వేసినా అది 6.5కి తగ్గింది. రిజర్వ్ బ్యాంక్ సైతం 7.2 నుంచి 7 శాతానికి తగ్గించింది. ఇప్పటి పరిస్థితి కనీసంగా రెండు సంవత్సరాలు ఉండొచ్చని, ఇప్పటికే పెద్ద ఆర్డర్లు వచ్చి ఉన్న కంపెనీలకు కొంతవరకు మేలు కలుగుతుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

రోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. చాలా మంది అనాథలుగా మారారు. ఇంతటి క్లిష్ట సమయంలోనూ ఒక వెలుగు వెలిగింది ఐటీ రంగం మాత్రమే. ఈ సమయంలో ఐటీ రంగం ఎన్నో కొత్త నియామకాలు చేపట్టి ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందించింది. ప్రాంగణ నియామకాలతోనూ కొత్తవారికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఇంతటి ప్రగతి సాధించిన ఐటీ రంగం నేడు తీవ్ర సంక్షోభంతో అతలాకుతలమయ్యే ప్రమాదం పొంచి ఉంది. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.

ఉనికిని కాపాడటం కోసం

ఐటీ రంగం కుదేలవ్వడానికి ప్రధాన కారణం అధిక ద్రవ్యోల్బణం. దీనిని అదుపు చేసేందుకు, ద్రవ్య చలామణిని అరికట్టేందుకు తొలుత అమెరికా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచింది. ఇదే విధానాన్ని ఇతర దేశాలూ అనుసరిస్తున్నాయి. మన రిజర్వు బ్యాంకు సైతం వడ్డీ రేట్లను పెంచింది. దీనికి తోడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతోనూ ఆర్థిక మాంద్యం ముంచుకు వస్తుందనే భయం పెరిగింది. ఆ సంకేతాలు రోజురోజుకూ ఉదృతమవుతూ వస్తున్నాయి. ఇలానే జరిగితే మున్ముందు ఐటీ రంగంలో 2008 నాటి గడ్డు పరిస్థితి పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి రానున్న ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు ఉంటుందని సీఈఓలు హెచ్చరిస్తున్నారు.

ఈ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని టెక్ కంపెనీలు ఇప్పటికే దిద్దుబాటు చర్యలు మొదలెట్టాయి. వ్యయ నియంత్రణకు విభిన్న మార్గాలు అమలు పరుస్తూ కంపెనీల ఉనికిని కాపాడుకోవడానికి సతమతమవుతున్నాయి. పలు కంపెనీలు ఉద్యోగులను తొలగించడం, కొత్త నియామకాలు నిలిపేయడం, మూన్ లైటింగ్ పేర ఉద్యోగులను తీసివేయడం, కొత్త నియామాకాల కోసం ఆఫర్ లెటర్ ఇచ్చినా వేరొక జాబ్ చూసుకోమని చెప్పడం, ఇచ్చిన లెటర్లను సైతం వెనుకకు తీసుకోవడం చేస్తున్నాయి. హెచ్చువేతనాలలో కోత పెడుతూ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఐటీ బూమ్ ఉన్న సమయంలో కనిపించని లోపాలు కంపెనీలకు ఇప్పుడు కనిపించడం ఆశ్చర్యకరం. అమెరికాలో టెక్ కంపెనీలు దాదాపు 45 వేల మందిని తొలగించినట్లు తెలుస్తున్నది.

గతంలో మాదిరిగా

మన దేశ ఐటీ రంగానికి రానున్నది గడ్డుకాలమే అంటున్నారు. భారత ఐటీ రంగం దాదాపు విదేశీ మార్కెట్లపై ఆధారపడి ఉంటుంది. వారే పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇస్తారు. వారి పరిస్థితే సరిగా లేకపోతే ఆర్డర్లు ఎలా ఇస్తారనే ప్రశ్న ఎదురవుతున్నది. మన దేశ ఐటీ కంపెనీ రెవెన్యూలో దాదాపు 80 శాతం ఉత్తర అమెరికా, యూరోపియన్ మార్కెట్ల నుంచే వస్తుంది. ఇప్పుడు వారి కంపెనీలు దెబ్బతింటే ఇక్కడి కంపెనీలు ప్రభావితమవుతాయి. అందుకే ముందు జాగ్రత్తగా దేశీయ కంపెనీలైన టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్, వంటి కంపెనీలు వివిధ కారణాలతో ఉద్యోగులను తొలగిస్తున్నారని చెబుతున్నారు. గత అక్టోబర్‌తో పోలిస్తే 18 శాతం నియామకాలు తగ్గాయని నివేదికలు తెలుపుతున్నాయి. 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ (జీఎఫ్‌సీ) వచ్చినప్పుడు వేలాది మంది ఐటీ ఉద్యోగులు రోడ్డుమీద పడ్డారు. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మనకా ముప్పు ఉండకపోవచ్చు

వివిధ దేశాల మాంద్యం ప్రభావం మన దేశంపై ఉండకపోవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో మాంద్యం నుంచి కోలుకున్నా ఈసారి పరిస్థితి అలా ఉండదనే భావన ఉంది. ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా ఆటోమేషన్, రోబోటైజేషన్ వైపు ఐటీ రంగం మళ్లే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఐటీ ఉద్యోగుల మనుగడ, కొత్త కొలువులు కష్టమవుతాయి. ఈ పరిస్థితుల కారణంగానే. దేశ జీడీపీ 7.5 గా అంచనా వేసినా అది 6.5కి తగ్గింది. రిజర్వ్ బ్యాంక్ సైతం 7.2 నుంచి 7 శాతానికి తగ్గించింది.

ఇప్పటి పరిస్థితి కనీసంగా రెండు సంవత్సరాలు ఉండొచ్చని, ఇప్పటికే పెద్ద ఆర్డర్లు వచ్చి ఉన్న కంపెనీలకు కొంతవరకు మేలు కలుగుతుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కొన్ని కంపెనీలు మాత్రం పొదుపును పాటించడం ఆరంభించాయి. ప్రస్తుతం దేశంలో భయానక పరిస్థితులు లేవనేది మరో అభిప్రాయం. మాంద్యం రాకుండానూ ఉండవచ్చు. కరోనా కాలంలో కూడా డిజిటల్ ఎకో సిస్టం పెరుగుతూ వచ్చింది. అది ప్రస్తుత సంక్షోభాన్ని కొంత మేరకు అదిమి పెట్టడంలో సహాయపడుతుంది. ఐటీ రంగం త్వరలోనే కోలుకుని ఉజ్వల భవిష్యత్తు దిశగా ముందుకు పోవాలని ఆశిద్దాం.


రుద్రరాజు శ్రీనివాసరాజు

లెక్చరర్, ఐ.పోలవరం

94412 39578

Next Story

Most Viewed