- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రిటన్ రాజకీయాల్లో.. అస్థిరత యుగం!
బ్రెక్సిట్ తర్వాత బ్రిటన్‌లో పెరిగిన రాజకీయ అస్థిరత, వరుస ప్రధాన మంత్రుల మార్పులు, ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం, ప్రజల అసంతృప్తి వంటి అంశాలు దేశ పాలనపై ఎలా ప్రభావం చూపాయో ఈ వ్యాసంలో వివరించబడింది.

ఈ పదేళ్లలో బ్రిటన్ ఆరుగురు ప్రధాన మంత్రుల్ని చూసింది. ఇప్పుడు ఏడో ప్రధానిగా బర్న్ హామ్ రాబోతున్నారు. రెండేళ్ల క్రితం ఎన్నికల్లో లేబర్ పార్టీని ఘనంగా గెలిపించి, సగౌరవంగా ప్రధాని పదవి చేపట్టిన ‘కీర్ స్టార్మర్’ తక్కువ సమయంలోనే రాజీనామా చెయ్యవలసి వచ్చింది. ఈయూ నుండి వైదొల గి- బ్రెక్సిట్ అమల్లోకి వచ్చి పదేళ్లు నిండకుండానే వరసగా ఆరుగురు ప్రధాన మంత్రులు తమ పదవీకాలం పూర్తిచేసుకోలేకపోయారు. రాజీనామాలకూ ఒక్కొక్కరిదీ ఒక్కో కారణమైనా, బ్రెక్సిట్ తర్వాత రాజకీయ, ఆర్థిక, సామాజిక ఒత్తిడులు పెరిగి పాలనా అస్థిరత కనిపించింది. ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం, జీవన వ్యయాల పెరుగుదల, అక్రమ వలసల సమస్యలు, ఆరోగ్య సేవల ఒత్తిడి వంటి అంశా లు ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి. కోవిడ్ మహమ్మారి ప్రభావం, అనంతర ఆర్థిక సంక్షో భం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన ఇంధన సంక్షోభం కూడా పరిస్థితిని మరింత క్లిష్టం చేశాయి. ఈ పరిణామాల మధ్య ప్రభు త్వం పట్ల ప్రజల నమ్మకం తగ్గింది. స్టార్మర్ హాయాంలో ఆర్ధిక స్థితి కొంత మెరుగైనా, ఆయ న చేయిదాటిన విషయాలు కూడా ఆయన్ని విఫలనేతగా ముద్ర వేశాయి. ఫలితంగా స్థానిక ఎన్నికల్లో అధికార లేబర్ పార్టీ ఘోరంగా దెబ్బతింది. ఇప్పుడు రాబోతున్న ప్రధాని బ్రిట న్‌ని ఎంతవరకు గట్టెక్కించగలడో చూడాలి. అమెరికా పన్ను విధానాలు, యుద్ధాలు ఆర్ధిక రంగాన్ని కుదేలు పరుస్తున్నప్పుడు ప్రజలమ ద్దతు నిలుపుకోవడం ఏ పాలకుడికైనా కత్తిమీద సామే. కాబట్టి వచ్చే నాయకుడు స్పష్టమైన విధానాలతో ముందుకెళ్తేనే పదవీకాలం పూర్తి చేయగలడు. లేదంటే ఈ క్యూ లైన్ ఇలాగే కొనసాగుతుంది.
-డా.డి.వి.జి.శంకరరావు
9440836931






