మనసులో మాట:కొనేదాకా పోరు సాగుతుంది

by Disha edit |
మనసులో మాట:కొనేదాకా పోరు సాగుతుంది
X

కేంద్రాన్ని,రాష్ట్ర బీజేపీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేసేలా, ప్రజల ముందు వారి వైఖరిని ఎండగట్టేలా, తెలంగాణవ్యాప్తంగా ఉధృత ఆందోళనలతో ఢిల్లీకి సెగ తగిలేలా రైతు పోరు చేయనున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలతో గులాబీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున ఉద్యమించనున్నారు. పార్లమెంటులో ఎంపీలు నిరసన వ్యక్తం చేయనున్నారు. వరి కొనుగోలుతోపాటు గిట్టు బాటు ధర, ఎస్‌టీ రిజర్వేషన్లు, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ పోరాటానికి రూపకల్పన చేశారు. గత వానాకాలం నుంచి యాసంగి వరి ధాన్యం వరకు తెలంగాణలో వడ్ల కొనుగోలు చేయక రైతులను కేంద్రం గోస పెడుతూనే ఉంది.

రి ధాన్యం కొనుగోలు విషయంలో మరోసారి కేంద్రంపై పోరుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. యాసంగి వరి ధాన్యం కొనాలని కేంద్రం ఒత్తిడి తేవాలని నిర్ణయించింది. కొనేదాక ఆందోళన చేయడానికి సిద్ధమవుతోంది. పంజాబ్ రాష్ట్రంలో వరి ధాన్యం మొత్తం కేంద్రమే కొనుగోలు చేస్తున్నట్లే తెలంగాణ వరి ధాన్యం కూడా కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నది. దేశానికి అన్నం పెడుతున్న రైతుల నోటిలో మట్టి కొట్టే విధంగా కేంద్రం విధానాలు ఉన్నాయి. ఇది తెలంగాణ రైతుల జీవన్మరణ సమస్య.

ఇప్పటికే గత ఏడాది నవంబర్ నెలలో వరి ధాన్యం కొనే విషయంలో నాన్చుడు ధోరణి అవలంబిస్తూ వస్తుంది. దీంతో ఈ దఫా పోరాటం ఉధృతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ నెల 24, 25 తేదీలలో దీనిపై పెద్ద యెత్తున రైతులతో నిరసన కార్యక్రమాలు చేయాలని, ఢిల్లీలో కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధానిని కలిసి వరి ధాన్యం కొనేలా డిమాండ్ చేయాలని టీఆర్ఎస్ఎల్‌పీ సమావేశం తీర్మానించింది. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఈ విషయంలో రాజీ పడేది లేదని విస్పష్టంగా ప్రకటించారు.

ఎఫ్‌సీఐ ఉన్నది అందుకే

కేంద్రాన్ని,రాష్ట్ర బీజేపీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేసేలా, ప్రజల ముందు వారి వైఖరిని ఎండగట్టేలా, తెలంగాణవ్యాప్తంగా ఉధృత ఆందోళనలతో ఢిల్లీకి సెగ తగిలేలా రైతు పోరు చేయనున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలతో గులాబీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున ఉద్యమించనున్నారు. పార్లమెంటులో ఎంపీలు నిరసన వ్యక్తం చేయనున్నారు. వరి కొనుగోలుతోపాటు గిట్టు బాటు ధర, ఎస్‌టీ రిజర్వేషన్లు, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ పోరాటానికి రూపకల్పన చేశారు. గత వానాకాలం నుంచి యాసంగి వరి ధాన్యం వరకు తెలంగాణలో వడ్ల కొనుగోలు చేయక రైతులను కేంద్రం గోస పెడుతూనే ఉంది.

ధాన్యం కొనుగోలు చేయాలని, నల్ల చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేసిన వారిలో సీఎం కేసీఆర్ కూడా ఉన్నారు. వ్యతిరేకత ఎక్కువైందని గ్రహించిన ప్రధాని రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయడం భేషరతుగా క్షమాపణ చెప్పడం తెలిసిందే. ఎండనక, వాననక రెక్కలు ముక్కలు చేసుకుని ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన ధాన్యం కొనబోమంటారు. ఇదేక్కడి న్యాయం? ధాన్యం కొనుగోలు, గిట్టుబాటు ధర వంటివి అన్ని కేంద్రం చేయాలి. ఎఫ్‌సీఐ ఉన్నది అందుకే కదా? దీనిపై కేంద్ర మంత్రులు 'రైస్ కొనము, ముడి బియ్యం కొంటాం' అని తలకిందుల మాటలు మాట్లాడతారు. కేంద్రం మొండి వైఖరితో రైతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసింది.

విద్వేషాలను రెచ్చగొట్టడం

తెలంగాణ రాష్ట్ర నిధులతో ప్రాజెక్టులు కట్టుకున్నము. రైతుబంధు, రైతు బీమా పథకాలు అమలు చేస్తున్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల ద్వారా నీళ్లతో తెలంగాణ మడి సస్యశ్యామలం అవుతూ పసిడి సిరులు కురిపించి గత సీజన్‌లో మూడు కోట్ల టన్నుల ధాన్యం పండించి. దేశానికి అన్నం పెడుతున్నది. అభివృద్ధి,సంక్షేమంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది ఎన్నో రాష్ట్రాలు ఇక్కడి పథకాలు స్ఫూర్తిగా తీసుకుని అమలు చేస్తున్నవి.

ఏడేళ్లుగా కేంద్రానికి మన రాష్ట్రం ఎంతో సహకరించినా నియ్యత్ లేకపాయే. పండించిన ధాన్యం కొనుగోలు చేయరు కానీ, ఓట్లు మాత్రం కావాలంటారు. ఇప్పటికైనా కేంద్రం తెలంగాణ యాసంగి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. దేశంలో హింసకు దారి తీసే విధంగా విధ్వేషాలు రెచ్చగొట్టడం, ఈడీ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలతో బెదిరించడం మాత్రమే పనిగా పెట్టుకున్నారు బీజేపీ వారు. ఇది సరైన విధానం కాదని తెలుసుకోవాలి.

చిటుకుల మైసారెడ్డి

జర్నలిస్ట్, సిద్దిపేట

94905 24724

Next Story

Most Viewed