ప్రసవం

by Disha edit |
ప్రసవం
X

టెక్నాలజీ పెరిగిపోయింది. డబ్బు పెడితే ఏదైనా అందుతున్న తరుణంలో నా కూతురి కాన్పుకి నొప్పులతో ఎందుకు అంతలా కష్టపడాలి. అని ఓ తండ్రి అనుకుంటాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి నొప్పి లేకుండా కాన్పు చేయలేమా? ఇంతగా టెక్నాలజీ వచ్చిందిగా? ఈ కాలంలో కూడా అప్పట్లో నాలాగా నొప్పులు భరించడం అవసరమా అని ఓ తల్లి అనుకుంటుంది. బయటకు ఎండకూడా తగలకుండా చదువుకున్న తనకు ఈ కాన్పులు ఈ నొప్పులు అవసరమా!? ఇంత చిన్న వయసులో సంపాదించుకున్నందుకు కనీసం నొప్పి లేకుండా పిల్లల్ని కనలేనా అని ఒక తల్లి కాబోతున్న అమ్మాయి అనుకుంటుంది. గూగుల్‌లో చూశాను. ప్రపంచంలో అన్ని నొప్పులకంటే కాన్పు నొప్పే ఎక్కువంట. అలాంటి నొప్పి నా భార్యకు అవసరమా? ఇంత సంపాదించాను. ఆ మాత్రం నొప్పిలేకుండా ఆమెను ప్రసవానికి పంపలేనా? అని తండ్రి కాబోతున్న ఇంకో యువకుడు అనుకుంటాడు.

అందుకే, అందరూ సిజేరియన్ బెస్ట్ కాస్త డబ్బు ఎక్కువైనా సుఖంగా ప్రసవం ఐపోతుందని అనుకుంటారు. ఎలాగు సిజేరియన్ కదా, మనకిష్టమున్న సమయంలో పుట్టేలా చేసుకోవచ్చు కనుక పుట్టే బిడ్డను మంచి ముహూర్తం లో బయటకు తీస్తే మంచిదని పంచాంగం చెప్పే అయ్యగారిని కలుస్తుంటారు. వాళ్ళేదో ముహూర్తం బాగుందనే సరికి అదే ముహూర్తానికి బిడ్డ పుట్టాలని డాక్టర్ దగ్గర పట్టుబడతారు. తామలా చేయలేమని డాక్టర్లు చెబితే సెంటిమెంట్ హర్ట్ అయి అప్పటికప్పుడు హాస్పిటల్‌నీ, డాక్టర్‌నీ మార్చేస్తుంటారు. ఎందుకొచ్చిన గోలని డాక్టర్లు సరే, అనక తప్పదు.సమాజంలో అందరూ సుఖ ప్రసవం గురించి ఆలోచిస్తూ కేవలం డాక్టర్లే డబ్బులకోసం సిజేరియన్లు చేస్తుంటారనే అపవాదేంటో ఎవరికీ అర్థం కాదు.

కొన్ని డెలివరీలు కష్టంగా ఉంటాయి. డాక్టర్లు ముందే ఊహించి, సిజేరియన్ ఐతేనే సేఫ్టీ అని చెబుతారు. కానీ, అలా చెప్పినా కేవలం డబ్బుల కోసమే అలా చెబుతున్నారు అని మరో అపవాదు. సెకండ్ స్టేజ్ ఆఫ్ డెలివరీ (డెలివరీ ఒక ప్రాసెస్ అనుకుంటే దానికి మూడు స్టేజీలు ఉంటాయి) ఆలస్యం అయ్యే కొద్దీ బిడ్డ సేఫ్టీగా పుడుతుందనే నమ్మకం తగ్గిపోతుంది. లోపలి బిడ్డకు కాసేపు ఆక్సిజన్ అందడం ఆగిపోయిందంటే ప్రాణానికి ప్రమాదం. ఇలాంటి పిల్లలు పుట్టగానే ఏడవరు. పుట్టాక సీ.పీ.ఆర్ చేస్తేకానీ బతకరు. ఒకవేళ బతికినా కండరాలు మెదడు బలహీనంగా ఉండే సెరెబ్రల్ పాల్సీతో జీవితాంతం బతకడం జరుగుతుంది.

మొన్న ఇలాగే ఓ గైనకాలజీ డాక్టర్ తో మాట్లాడితే, ఆమె ఇదే అన్నారు. ఒకప్పుడు కొద్దిగా బ్రెయిన్ డెవలప్ కాని పిల్లలు తరచుగా కనబడేవారు. ఈ కాలంలో ఎందుకు కనబడటం లేదంటే గైనకాలజిస్టులు సరైన సమయంలో అవసరమనుకుంటే సిజేరియన్లు చేయడం వలన బర్త్ asphyxia( అంటే పుట్టేటప్పుడు బిడ్డ కాసేపు ఆక్సిజన్ లోపంతో ఇబ్బందిపడటం) లు తగ్గడం పుట్టిన వెంటనే బిడ్డ ఏడ్వడం పెరిగింది. తద్వారా సెరెబ్రల్ పాల్సీలూ తగ్గాయి. అన్నారు. ఇదంతా ఎందుకంటే..సైన్సుని సైన్సులాగానే అర్థం చేసుకోకుండా మరే రకంగా అర్థం చేసుకున్నా దాని పర్యవసానాలు ఎవరికీ అర్థం కూడా కావు. ఇదంతా ఎందుకు అంటే ..ఎవరిని ఎలా కాన్పుకి తీసుకెళ్ళాలో డాక్టర్లు నిర్ణయించాలి కానీ చుట్టూఉన్న జనాలూ సమాజమూ ప్రభుత్వాలూ పట్టుబట్టి నిర్ణయిస్తామంటే ఎలాగా అని.

అంతా దైవేచ్చ నాయనా..

(ఫేస్‌బుక్ నుంచి సేకరణ)



Next Story

Most Viewed