లంపీ వైరస్‌తో వారి జీవితాలలో కలవరం

by Disha edit |
లంపీ వైరస్‌తో వారి జీవితాలలో కలవరం
X

ఈ వ్యాధిని 1929లో జాంబియాలో గుర్తించారు. క్రమంగా ఇది 2019లో బంగ్లాదేశ్, చైనా, ఇండియాకు చేరింది. భారత శాస్త్రవేత్తలు ఈ వ్యాధికి 'లంపీ-ప్రో వ్యాక్ ఇండ్ టీకా' అభివృద్ధి చేసినా దానిని పూర్తి స్థాయిలో వాడటానికి కొంత సమయం పడుతుంది. ఇప్పటికైతే 'గోట్ ఫాక్స్ టీకా' వేసి కొంత వరకు సత్ఫలితాలు రాబట్టారు. ఈ వ్యాధి సోకిన పశువులకు జ్వరం వస్తుంది. శరీరంపై ముద్దలు ఏర్పడతాయి. శ్వాస ఇబ్బందులు, కండ్లు ముక్కుల నుంచి నీరు కారడం, ఆకలి కోల్పోవడం, నీరసం వంటివి సంభవించి చనిపోవచ్చు. ఈ వ్యాధి సోకిన ఆవుల పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోతుందని, గర్భస్రావం కూడా జరగవచ్చని తెలుపుతున్నారు. పశువులకు వైరస్‌ సోకిన 28 రోజులలో వ్యాధి లక్షణాలు బయట పడతాయని గుర్తించారు.

రోనా వైరస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మానవాళికి ఇది 'మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు'గా మారింది. పాడి పశువులపై ఆధారపడుతున్న రైతాంగానికి 'లంపీ స్కిన్ వ్యాధి' పిడుగులా దాపురించింది. ఈ వ్యాధితో లక్షల మంది పాడి రైతుల జీవనోపాధి సంక్షోభంలో పడవచ్చని కలవరపడుతున్నారు. ఈ వ్యాధి గురించిన నిజానిజాలు తెలియక పాడి రైతులు అయోమయంలో పడుతున్నారు.

మనుషులకు సోకుతుందా?

దేశంలో 192.5 మిలియన్ పశువుల ద్వారా 210 మిలియన్ టన్నుల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 2.4 మిలియన్ పాడి పశువులు వైరస్ బారిన పడినాయని, అందులో 1.10 లక్షల పశువులు చనిపోయాయని గణాంకాలు వివరిస్తున్నాయి. ఈ వ్యాధి తీవ్రత రాజస్థాన్‌లో అధికంగా ఉందని గుర్తించారు. సెప్టెంబర్ నాటికే ఈ వ్యాధి గుజరాత్‌, యూపీ, మహారాష్ట్ర, హర్యానా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, పంజాబ్‌ లాంటి 18 రాష్ట్రాలకు చెందిన 251 జిల్లాలకు చేరిందని కేంద్రం ప్రకటించింది. ఒక్క రాజస్థాన్‌లోనే రోజుకు ఆరు లక్షల లీటర్ల పాల దిగుబడి తగ్గిపోయిందని గమనించారు.

లంపీ స్కిన్ వ్యాధితో బాధపడుతున్న ఆవు పాలను తాగడం మానవ ఆరోగ్యానికి హానికరమనే ప్రచారంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఇది జునోటిక్ వ్యాధి (జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు సంక్రమించేవి) వర్గంలోనిది కాదని, వైరస్ సోకిన పశువుల పాలను తాగినవారికి ప్రమాదమేమి ఉండదని శాస్త్రజ్ఞులు తెలుపుతున్నారు. ఇదే విషయాన్ని ఐరాస ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తన నివేదికలోనూ వెల్లడించింది. కానీ, ఈ వ్యాధి సోకిన ఆవు పాలు తాగిన దూడలకు వ్యాధి సంక్రమించవచ్చని హెచ్చరిస్తున్నారు. జంతువు నుంచి జంతువుకు వ్యాపించగల ఈ వ్యాధి ఆవులు, గేదెలు, మేకలు గొర్రెలకు సోకే ప్రమాదం ఉందని తెలిపారు. జంతువు నుంచి మనిషికి సోకదని నిర్ధారించారు. శుద్ధి చేసిన పాయిశ్చరైజ్ పాలను వాడటం లేదా మరిగించడం మంచిది.

Also read: అతిపెద్ద సామాజిక భద్రత పథకం! నేడు అవినీతి కూపం

ఈ వ్యాధి లక్షణాలు

ఈ వ్యాధిని 1929లో జాంబియాలో గుర్తించారు. క్రమంగా ఇది 2019లో బంగ్లాదేశ్, చైనా, ఇండియాకు చేరింది. భారత శాస్త్రవేత్తలు ఈ వ్యాధికి 'లంపీ-ప్రో వ్యాక్ ఇండ్ టీకా' అభివృద్ధి చేసినా దానిని పూర్తి స్థాయిలో వాడటానికి కొంత సమయం పడుతుంది. ఇప్పటికైతే 'గోట్ ఫాక్స్ టీకా' వేసి కొంత వరకు సత్ఫలితాలు రాబట్టారు. ఈ వ్యాధి సోకిన పశువులకు జ్వరం వస్తుంది. శరీరంపై ముద్దలు ఏర్పడతాయి. శ్వాస ఇబ్బందులు, కండ్లు ముక్కుల నుంచి నీరు కారడం, ఆకలి కోల్పోవడం, నీరసం వంటివి సంభవించి చనిపోవచ్చు. ఈ వ్యాధి సోకిన ఆవుల పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోతుందని, గర్భస్రావం కూడా జరగవచ్చని తెలుపుతున్నారు. పశువులకు వైరస్‌ సోకిన 28 రోజులలో వ్యాధి లక్షణాలు బయట పడతాయని గుర్తించారు.

ఈ వ్యాధి ఒక పశువు నుంచి మరో పశువుకు సంక్రమిస్తుంది. వ్యాధి తీవ్రత పెరిగితే దేశ పాడి రైతుల ఆర్థిక స్థితి కుదేలవుతుందని, పాడి పరిశ్రమ సంక్షోభంలోకి నెట్టివేయబడుతుందని అంటున్నారు. పేదరిక రక్కసి కోరలలో చిక్కి విలవిలలాడుతున్న పాడి రైతులకు లంపీ స్కిన్ వైరస్ వ్యాప్తి పెనంలోంచి పొయ్యిలోకి నెట్టివేస్తుంది. ప్రపంచంలోనే అత్యధిక పశుసంపద, పాల ఉత్పత్తులను అందిస్తున్న రైతులను ప్రభుత్వాలు సత్వరమే ఆదుకోవాలి. ఈ వ్యాధి సోకకుండా టీకాలను అన్ని పశువులకు విధిగా అందించాలి. సాగు పాడి ఉత్పత్తిదారులను లంపీ స్కిన్ వైరస్ విపత్తు నుంచి కాపాడుకోని శ్వేత విప్లవానికి ఊతం ఇవ్వాలి.

డా: బుర్ర మధుసూదన్ రెడ్డి

కరీంనగర్

99497 00037

Next Story

Most Viewed