అమెరికాలో పరిశోధనా గ్రంథాలయాలు

by Disha edit |
అమెరికాలో పరిశోధనా గ్రంథాలయాలు
X

త్తర అమెరికా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు స్వతంత్ర పరిశోధనా లైబ్రరీల కన్సార్టియంగా 'సెంటర్ ఫర్ రీసెర్చ్ లైబ్రరీస్ (CRL)' ఏర్పాటు చేశారు. దీనిలో సభ్యత్వం తీసుకున్నవారికి, విద్యాసంస్థలకు, పరిశోధనా వ్యవస్థలకు కావాల్సిన సాంప్రదాయ, డిజిటల్ గ్రంథాలను, ఇతర గ్రంథాలయ వనరులను ఇది సేకరిస్తుంది. వాటిని సంరక్షించి ఇంటర్‌ లైబ్రరీ లోన్, ఎలక్ట్రానిక్ డెలివరీ ద్వారా సభ్యసంస్థలకు అందుబాటులో ఉంచుతుంది. పుస్తకాలను, వనరులను భౌతిక రూపంలోనూ, డిజిటల్ రూపంలోనూ సేకరించి పరిరక్షిస్తుంది. ఈ డేటాను విశ్లేషించి సభ్యత్వం పొందిన ఇతర గ్రంథాలయాల అవసరాల మేరకు తమ సేకరణలను అందిస్తుంది. సేకరించిన సమాచారాన్ని (Data)ను నిర్వహించడంలో కావాల్సిన సాంకేతిక సహాయాన్ని, శిక్షణ, ఇతర అనుభవ నైపుణ్యాన్ని అందిస్తుంది. 'సెంటర్ ఫర్ రీసెర్చ్ లైబ్రరీస్ (CRL)' అనేది 1949లో 'మిడ్‌వెస్ట్ ఇంటర్-లైబ్రరీ సెంటర్' (MILC) గా స్థాపించబడింది. ప్రారంభంలో సాంప్రదాయక పద్ధతిలో గ్రంథాలను భౌతిక రూపంలోనే సేకరించేది. కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులకు తగ్గట్లుగా డిజిటల్ యుగంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు డిజిటలైజేషన్, లైసెన్సింగ్ సేకరణలకు ఫెసిలిటేటర్‌గా నవీకరించారు.

అందుకు అనుగుణంగా

ఈ పరివర్తనకు అనుగుణంగా అవసరాల కోసం CRL ఇతర కీలక విద్యా, పరిశోధనా సంస్థల భాగస్వాముల నుంచి కొత్త నిధులను (ఆర్థిక సహాయాన్ని) సమకూర్చుకొవాల్సి ఉంది. కమ్యూనిటీ ఔట్ రీచ్, ఎంగేజ్‌మెంట్‌కు మద్దతుగా ప్రస్తుత సాంకేతికతను నవీకరించడం కూడా అవసరం. అందుకోసం ఆండ్రూ W. మెల్లన్ ఫౌండేషన్, నేషనల్ సైన్స్ ఫౌండేషన్, IMLS ద్వారా నిధులు సేకరించింది. మొదట 1949లో సెంటర్ ఫర్ రీసెర్చ్ లైబ్రరీస్‌ని స్థాపించినప్పుడు, రెండవ ప్రపంచ యుద్ధానంతర యుగం ఉత్పత్తి మీద, ప్రత్యేకంగా ముద్రణ సామగ్రి మీద దృష్టి సారించింది. అపుడు ఇది 10 మిడ్-వెస్ట్రన్ విశ్వవిద్యాలయాల కూటమిగా ఏర్పడింది. హ్యుమానిటీస్ అధ్యయనాలు, సాంఘిక శాస్త్ర పరిశోధన ప్రయత్నాలకు మద్దతుగా నిలిచింది.

CRL నిజానికి ఏ విశ్వవిద్యాలయం నిర్వహించలేని సామూహిక గ్రంథాల వనరుల సేకరణకు (Collective collection) పూనుకుంది. కంటెంట్‌లలో విదేశీ వార్తాపత్రికలు, ప్రభుత్వ పత్రాలు, మైక్రోఫార్మ్ ఆర్కైవ్‌లు, చారిత్రక పత్రికలు, మ్యాపులు, విదేశీ పరిశోధనా గ్రంథాలు, పరిశోధనకు కీలకమైనవిగా గుర్తించబడిన ఇతర సమాచార అంశాలను విరివిగా సేకరించింది. CRL దీనికోసం NERLకి నిలయంగా మారింది. అందుకే దీనిని 'నార్త్ ఈస్ట్ రీసెర్చ్ లైబ్రరీస్ కన్సార్టియం' అని పిలుస్తారు. దీనిలో 28 అకడమిక్ రీసెర్చ్ లైబ్రరీలు, 80 అనుబంధ సంస్థలు సభ్యత్వం కలిగి వున్నాయి. అందుకే ఆన్‌లైన్ ఉత్పత్తులకు లైసెన్స్‌లను చర్చించే ఒక విద్యా లైబ్రరీ కన్సార్టియంగా ఉంది.

అనేక సేకరణలతో ముందుకు

ప్రస్తుత పరిస్థితులలో ఇంటర్నెట్ ఆధారంగా సాంకేతికత అభివృద్ధికి తగినట్లుగా భౌతిక రిపోజిటరీకి తక్కువ ప్రాముఖ్యతను ఇస్తుంది. లాభదాయక ఆర్థిక, పారిశ్రామిక, విద్యారంగాలలో పరిశోధనకు అవసరమైన అధునాతన సమాచారం సేకరించి, అవసరమైన సంస్థలకు విక్రయించి లాభాలను గడిస్తుంది. లాభాపేక్షతో కూడిన పరిశోధనలకు, పరిశ్రమలకు సేవలందించేందుకు టెక్స్ట్ ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ల వంటి ప్రపంచీకరణ కార్యక్రమాలను చేపడుతుంది.

ఈ కొత్త వ్యూహం ప్రకారం CRL వాటి వనరులను మూడు ప్రధాన సేవారంగాలుగా విభజించింది: 1.CRL సభ్యుల లైబ్రరీ సేకరణలను క్రమబద్ధంగా డిజిటలైజేషన్ చేసి, నిర్ధిష్ట ప్రాజెక్ట్‌లకు మద్దతుగా సోర్స్ మెటీరియల్‌ను రూపొందిస్తుంది. 2. CRL ద్వారా కమ్యూనిటీకి కీలక మెటీరియల్‌‌ను ముఖ్యంగా వార్తలు, ఆర్కైవ్‌లు, చారిత్రక పత్రికలు, ప్రభుత్వ సమాచారానికి ఎలక్ట్రానిక్ యాక్సెస్‌ను అందిస్తుంది. డిజిటల్ రిపోజిటరీలు, సేకరణలు, సేవలపై సమాచారాన్ని CRL లైబ్రరీలకు అందుబాటులో ఉంచుతుంది. 4. డిజిటల్ వనరులు సంరక్షణలో పెట్టుబడికి మద్దతు ఇస్తుంది. 5. కీలక భాగస్వాముల సమన్వయంతో ఆర్కైవింగ్, డేటా సేకరణ ద్వారా CRL కమ్యూనిటీకి 'చివరి-కాపీ' పేపర్, మైక్రోఫార్మ్ సేకరణలకు నిరంతర, దీర్ఘకాలిక సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇతర పథకాలు

అంతర్జాతీయ వార్తాపత్రిక సేకరణ, సంరక్షణను ప్రోత్సహించే ప్రయత్నంగా వార్తాపత్రికలపై ఇంటర్నేషనల్ కొయిలిషన్ అంచనాను ఈ కేంద్రం పర్యవేక్షిస్తుంది. CRL వార్తాపత్రికలు, అంతర్జాతీయ డాక్టోరల్ పరిశోధనలు, ప్రభుత్వ పత్రాలు, ప్రచురణలు, అంతర్జాతీయ ధారావాహికలు, ఇతర మోనోగ్రాఫ్‌ల పెద్ద సామూహిక సేకరణలను ఐటెమ్‌లను ఎటువంటి ఛార్జీ లేకుండా సభ్యులకు రుణంగా ఇస్తాయి. అయితే సభ్యులు కాని వారికి కలెక్షన్‌ల యాక్సెస్ కోసం ఛార్జీ విధించబడుతుంది. ఈ విధంగా సేవలు అందించటం వల్లా ఆర్ధికంగా ఈ సంస్థలు బలపడవచ్చునని నిరూపణ అయ్యింది. ఇప్పుడు ఆర్ధికంగా లాభదాయకమైన ఇలాంటి విధానాలను అనేక యూరోపియన్ దేశాలతో పాటు ఆసియా దేశాలు అనుసరిస్తున్నాయి. మన దేశంలో కూడా U.G.C, INFLIBNET ఈ దిశలో అడుగు వేస్తుంది.

డా. కోలాహలం రామ్‌కిశోర్

98493 28496

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Also Read...

నామినేటెడ్ పోస్టుల భర్తీ ఎప్పుడు?




Next Story

Most Viewed