11 ఏళ్లలో మొదటిసారి అత్యధికంగా పెరిగిన వంట నూనె ధరలు!

by  |
11 ఏళ్లలో మొదటిసారి అత్యధికంగా పెరిగిన వంట నూనె ధరలు!
X

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల కరోనా మహమ్మారి కారణంగా నిత్యావసర ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలోనే వంట నూనె ధరలు గత దశాబ్ద కాలంలోనే అత్యధికంగా నమోదయ్యాయి. ఈ ఏడాది మరోసారి కరోనా, లాక్‌డౌన్ ఆంక్షలతో వంట నూనె ధరలు మరింత పెరిగే కారణమైనట్టు పౌరసరఫరాల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశీయంగా వినియోగంలో ఉన్న ఎడిబుల్ ఆయిల్ ధరలు సగటున అధికంగా పెరిగిపోవడంతో గడిచిన 11 ఏళ్లలోనే ఎక్కువ ధరకు చేరుకున్నట్టు తెలుస్తోంది. వేరుశెనగ, ఆవ, పొద్దుతిరుగుడు, వనస్పతి, పామాయిల్ వంటి అన్నిరకాల నూనె ధరలు పెరిగిపోయాయి. ప్రధానంగా కరోనా సెకెండ్ వెవ్‌తో లాక్‌డౌన్ విధించడంతో రాష్ట్రాల మధ్య సరఫరా, ఆర్థిక లావాదేవీలపై ఈ ప్రభావం అధికంగా ఉందని, అందుకే ధరలు రికార్డు స్థాయిలో పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

తాజా గణాంకాల ప్రకారం.. 2010, జనవరి తర్వాత ఆవాల నూనె ధరలు రూ. 63 నుంచి గత నెల ఏప్రిల్‌లో రూ. 155కి పెరిగాయి. గతేడాది ఇది రూ. 118 నుంచి 39 శాతం పెరిగి ప్రస్తుత నెలలో రూ. 164కి చేరుకుంది. మన దేశంలో ఎక్కువ వినియోగించే పామాయిల్ గతేడాది రూ. 88 నుంచి రూ. 131కి చేరుకుంది. ఇది దాదాపు 50 శాతం అధికం. ఇదే నూనే 2010లో రూ. 49గా ఉంది. ఇక ఇళ్లలో వాడుతున్న వేరుశెనగ నూనె రూ. 175, పొద్దుతిరుగుడు రూ. 170, వనస్పతి రూ. 127, సోయా రూ. 148కి చేరుకుంది. వీటి ధరల పెరుగుదల 19-52 శాతం మధ్య పెరిగినట్టు గణాంకాలు వెల్లడించాయి.



Next Story