జూన్ 14తర్వాతే ఎంసెట్..

by  |
జూన్ 14తర్వాతే ఎంసెట్..
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కారణంగా ఇన్ని రోజులు మూతబడిన స్కూళ్లు, కాలేజీలు ఇప్పుడిప్పుడే తెరచుకుంటున్నాయి. అనుకున్న సమయానికే అన్ని తరగతుల వారికి పరీక్షలు నిర్వహించి అకాడమిక్ ఇయర్ పూర్తి చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది.

ఈ నేపథ్యంలోనే జూన్ 14 తర్వాత ఎంసెట్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది.ఎంసెట్ ఫస్టియర్ పూర్తి సిలబస్, సెకండియర్‌లో 70శాతం సిలబస్ వరకే పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది.అలాగే ఈసారి ఎంసెట్ పరీక్షల్లో ఛాయిస్ పెంచుతామని, ఇంటర్ వెయిటేజీ ఎంసెట్‌లో ఉంటుందని విద్యాశాఖ తెలిపింది.

Next Story

Most Viewed