స్వామి వారి పల్లకి సేవలో మంత్రి పువ్వాడ.

84

దిశ ఖమ్మం కల్చరల్: విజయదశమిని పురస్కరించుకుని ఖమ్మం నగరంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయం నుండి అంగరంగ వైభవంగా స్వామి వారి పారువేట కొనసాగింది. స్వామి వారి పల్లకి వద్ద కొబ్బరికాయ కొట్టి పల్లకిని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎత్తుకుని ప్రారంభించారు. డప్పు వాయిద్యాలు, కోలాటాలు నడుమ రేవతి సెంటర్, వైరా రోడ్, అంబెడ్కర్ సెంటర్, జమ్మిబండ లోని లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంకు తీసుకొచ్చి అక్కడ ప్రత్యేక జమ్మి పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా దుర్గాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయానికి ప్రతీకగా రావణ దహనం చేశారు. దసరా సందర్భంగా జమ్మిబండ ఆలయ ప్రాంగణంలో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజ నిర్వహించారు. వేడుకలకు ప్రజలు, భక్తులు పేద్ద ఎత్తున పెద్ద ఎత్తున ప్రజలు హాజరైయ్యారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..