మంత్రి మల్లారెడ్డిపై పోలీస్ కేసు

by  |
మంత్రి మల్లారెడ్డిపై పోలీస్ కేసు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి, మల్లారెడ్డి విద్యా సంస్థల అధినేత చామకూర మల్లారెడ్డికి ఊహించని షాక్ తగిలింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆయనపై భూ కబ్జా కేసు నమోదు కావడం గమనార్హం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం సూరారంలోని సర్వే నెంబర్ 115, 116, 117లోని తనకు సంబంధించిన భూమిని అమ్మాలంటూ మంత్రి మల్లారెడ్డి అనుచరుల చేత బెదిరింపులు చేస్తున్నారని శ్యామల అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొత్తం 2 ఎకరాల 13 గుంటల భూమిలో ఇప్పటికే 20 గుంటల భూమిని కబ్జా చేసి కాంపౌండ్ వాల్ నిర్మించుకున్నారని ఫిర్యాదులో తెలిపింది. అంతేకాకుండా, కోర్టులో పిటిషన్ వేయడానికి నియమించుకున్న లాయర్ లక్ష్మీ నారాయణను కూడా మంత్రి కొనేశారని ఆరోపించింది. దీంతో లాయర్ నకిలీ అగ్రిమెంట్‌ను సృష్టించాడని.. దిక్కుతోచని స్థితిలో పోలీసులు ఆశ్రయించినట్టు శ్యామల ఆవేదన వ్యక్తం చేసింది. ఇక మహిళ ఫిర్యాదు ఆధారంగా మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి మరో ఐదుగురిపై సెక్షన్ 446,506r/w, 34 ఐపీసీ సెక్షన్ల కింద దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story

Most Viewed