బ్రేకింగ్: బాలయ్యను కలిసిన మోహన్ బాబు.. నారా లోకేష్ ఓటమిపై సంచలన వ్యాఖ్యలు

by  |

దిశ, వెబ్‌డెస్క్: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారి డాక్టర్ మోహన్ బాబు, ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు నందమూరి బాలకృష్ణను కలిశారు. గురువారం ఉదయం మర్యాదపూర్వకంగా బాలయ్యను కలిశారు. దీంతో ఈ భేటీ టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బాలకృష్ణ అల్లుడి(నారా లోకేష్)ని ఓడించడానికి నేను ప్రచారం చేశాను. నాడు మంగళగిరిలో తెలుగు దేశం పార్టీ ఓడిపోయింది. అయినా, బాలకృష్ణ అదేమీ మనసులో పెట్టుకోకుండా, ‘మా’ ఎన్నికల సమయంలో విష్ణుకు తోడుగా ఉంటానని ప్రకటించారు. అండగా ఉండి, ఓటేశారని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

అనంతరం మంచు విష్ణు మాట్లాడుతూ.. అక్టోబర్ 16న ఉదయం 11:30 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ‘మా’ ఎన్నికల్లో నాకు సహకరించి, గెలుపునకు కృషి చేసిన అందరినీ ఒక్కొక్కరిగా కలుస్తున్నాము. ఇప్పటికే కోటా శ్రీనివాసరావు, పరుచూరి బ్రదర్స్‌ను కలిశాము. తర్వాత మెగాస్టార్ చిరంజీవిని కూడా కలుస్తాము. ఎన్నికలకు ముందు ఎలా ఉన్నా.. ఇకనుంచి ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులను కూడా కలుపుకొని వెళ్తాము. ‘మా’ అసోసియేషన్‌లో ఒక పాజిటివ్ వాతావరణం నెలకొల్పడమే మా లక్ష్యం అని అన్నారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామాలపై ఈసీ మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకుంటామని మంచు విష్ణు చెప్పారు.

అలాంటి వారి పక్కలో పడుకుంటే ఇలాగే అవుతుంది.. సింగర్ చిన్మయి పోస్ట్ వైరల్

Next Story