అర్హ‌త లేకున్నా అలోపతి వైద్యం.. ఆస్ప‌త్రి సీజ్

by Sridhar Babu |

<p>దిశ‌, ఖ‌మ్మం: భ‌ద్రాచ‌లంలో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నిర్వ‌హిస్తున్న ఓ ఆస్ప‌త్రిని జిల్లా వైద్యాశాఖాధికారి భాస్క‌ర్ సీజ్ చేశారు. ప‌ట్ట‌ణంలోని అంబేద్కర్ హాస్పిటల్‌లో బీహెచ్ఎంఎస్ విద్యా అర్హతతో డాక్టర్ భానుప్రసాద్ అలోపతి వైద్య విధానంలో చికిత్స అందిస్తున్నట్టు పలు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు బుధ‌వారం వైద్య నిపుణుల బృందం ఆస్ప‌త్రిని సంద‌ర్శించింది. వైద్య అర్హ‌త ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ను ప‌రిశీలించ‌డంతోపాటు ఆస్ప‌త్రి రికార్డులు, రోగులకు అందిస్తున్న వైద్యం గురించి వైద్యుల బృందం పరిశీలించింది. డాక్టర్ భాను ప్రసాద్‌కు అర్హ‌త [&hellip;]</p>

అర్హ‌త లేకున్నా అలోపతి వైద్యం.. ఆస్ప‌త్రి సీజ్
X

దిశ‌, ఖ‌మ్మం: భ‌ద్రాచ‌లంలో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నిర్వ‌హిస్తున్న ఓ ఆస్ప‌త్రిని జిల్లా వైద్యాశాఖాధికారి భాస్క‌ర్ సీజ్ చేశారు. ప‌ట్ట‌ణంలోని అంబేద్కర్ హాస్పిటల్‌లో బీహెచ్ఎంఎస్ విద్యా అర్హతతో డాక్టర్ భానుప్రసాద్ అలోపతి వైద్య విధానంలో చికిత్స అందిస్తున్నట్టు పలు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు బుధ‌వారం వైద్య నిపుణుల బృందం ఆస్ప‌త్రిని సంద‌ర్శించింది. వైద్య అర్హ‌త ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ను ప‌రిశీలించ‌డంతోపాటు ఆస్ప‌త్రి రికార్డులు, రోగులకు అందిస్తున్న వైద్యం గురించి వైద్యుల బృందం పరిశీలించింది. డాక్టర్ భాను ప్రసాద్‌కు అర్హ‌త లేకున్నా అలోప‌తి విధానంలో వైద్యం చేస్తున్నార‌ని డీఎంహెచ్‌వో భాస్క‌ర్ నిర్ధారించారు. అర్హత లేని వైద్యం విధానంలో చికిత్స అందించడం నేరమని కాబట్టి, అంబేద్కర్ ఆస్ప‌త్రిని సీజ్ చేస్తున్న‌ట్టు ఆయన ప్ర‌క‌టించారు. ఈ త‌నిఖీల్లో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ శ్రీనివాస్, భ‌ద్రాచ‌లం డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ నరేష్ కుమార్, సీసీ శ్రీనివాస్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

tags: doctor misuse his practice, dhmo seaz hospital, bhadrachalam

Next Story