ఐపీఎల్ ఆడే క్రికెటర్ల జీతాలు కట్ చేయండి..

by  |
ఐపీఎల్ ఆడే క్రికెటర్ల జీతాలు కట్ చేయండి..
X

దిశ, స్పోర్ట్స్ : బీసీసీఐ నిర్వహించే క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌లో ఆడాలని ప్రపంచంలోని ప్రతీ ఒక్క క్రికెటర్ కోరుకుంటారు. పేరుతో పాటు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అందుతుండటంతో ఐపీఎల్ ఆడటానికి జాతీయ జట్టులో స్థానాన్ని కూడా కాదనుకుంటున్న ఆటగాళ్లు ఉన్నారు. పెద్ద మొత్తంలో డబ్బు వస్తున్న ఐపీఎల్‌ను ఆడటానికే తాను ప్రాధాన్యత ఇస్తానని.. ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టు నుంచి తప్పుకోవడానికి కూడా సిద్దమేనంటూ జాస్ బట్లర్ వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్‌కాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్‌లో ఆడటానికి జాతీయ జట్టును నిర్లక్ష్యం చేసే ఆటగాళ్ల జీతాల్లో కోత విధించాలని అన్నాడు. ఒక్క ఇంగ్లాండ్ బోర్డు కాకుండా అన్ని దేశాల బోర్డులు 10 శాతం జీతాన్ని కట్ చేయాలని జెఫ్రీ డిమాండ్ చేశాడు. ‘ఐపీఎల్‌లో ఆడటాన్ని నేను అడ్డుకోవడం లేదు. కానీ, జాతీయ జట్టుకు మొదట ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత క్రికెటర్లపై ఉన్నది. ఇంగ్లాండ్ జాతీయ జట్టులోని ఆటగాళ్లకు భారీ మొత్తంలోనే జీతం లభిస్తున్నది. కాబట్టి వాళ్లు దేశానికి ప్రాధాన్యత ఇవ్వాలి’ అని బాయ్‌కాట్ పేర్కొన్నాడు. ఇక ఈసీబీ అవలంభిస్తున్న రొటేషన్ పద్దతి తెలివితక్కువ పని అని విమర్శించాడు.

Next Story

Most Viewed