శభాష్.. రేవంత్.. రిజర్వేషన్ల ఇష్యూలో మోడీ, బీజేపీని కార్నర్ చేయడంలో భారీ సక్సెస్..!

by Disha Web Desk 19 |
శభాష్.. రేవంత్.. రిజర్వేషన్ల ఇష్యూలో మోడీ, బీజేపీని కార్నర్ చేయడంలో భారీ సక్సెస్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రిజర్వేషన్ల ఇష్యూలో ప్రధాని మోడీ, బీజేపీని కార్నర్ చేయడంతో పాటు ఆధారాలు సైతం బహిర్గతం చేసి దేశ వ్యాప్తంగా పార్టీ మైలేజ్ పెరిగేలా చేశారని కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తున్నది. ఏఐసీసీలోని కీలక నేతలు సైతం రేవంత్ పనితీరును మెచ్చుకున్నట్టు సమాచారం. ‘కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే.. రిజర్వేషన్లు రద్దవుతాయి’ అనే అంశాన్ని సీఎం రేవంత్ తాను పాల్గొన్న ప్రతి ఎన్నికల ప్రచారంలోనూ ఫోకస్ చేయడంతో పాటు అందుకు సంబంధించిన ఆధారాలు బహిర్గతం చేశారు. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరగడంతో పాటు అందరి దృష్టినీ ఆకర్షించడంలో సక్సెస్ అయ్యారని, పార్టీ ప్రతిష్ట సైతం పెరిగిందని కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ను ప్రశంసిస్తున్నట్టు తెలుస్తున్నది.

తక్కువ సమయంలోనే జాతీయ స్థాయి గుర్తింపు నేతగా

రేవంత్.. సీఎంగా బాధ్యతలు చేపట్టి ఐదు నెలలు పూర్తయింది. ఇంత తక్కువ సమయంలో ఆయనకు సౌత్ ఇండియా స్ట్రాంగ్ లీడర్‌గా గుర్తింపు లభించిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. సమయం, సందర్భం చూసుకొని ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీ తరుఫున ప్రచారం చేస్తున్నారు. సుమారు అన్ని చోట్లా రిజర్వేషన్ల అంశాన్ని ఫోకస్ చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని టార్గెట్ చేశారు. మూడోసారి కాషాయ పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ప్రజల్లో నమ్మకం కల్గించేలా స్పీచ్ ఇవ్వడంతో పాటు ఆధారాలు సైతం బహిర్గతం చేశారు.

జాతీయ స్థాయిలో చర్చ.. క్లారిటీ ఇచ్చిన బీజేపీ

రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. ఇవి బీజేపీకి నెగిటివ్‌గా మారే ప్రమాదం ఉన్నదని గ్రహించిన ఆ పార్టీ జాతీయ స్థాయి లీడర్లు రంగంలోకి దిగారు. తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని స్వయంగా ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ సైతం వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆర్ఎస్ఎస్‌పై ఎటాక్

రిజర్వేషన్ల అంశంపై అమిత్‌షా మాట్లాడని అంశాన్ని మాట్లాడినట్టుగా ఫేక్ వీడియోను టీపీసీసీ సృష్టించిందని కాంగ్రెస్ ఐటీ విభాగంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే సీఎం రేవంత్ పైనా కేసు నమోదు చేసి విచారణకు రావాలని నోటీసులు అందజేశారు. దీంతో రేవంత్‌రెడ్డి.. బీజేపీ మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను తెరమీదికి తీసుకొచ్చారు. రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ ఆలోచనలు ఎంటీ..? సంస్థ సిద్ధాంతకర్తలు ఏం రాశారు..? అనే విషయాలను చదివి వినిపించి, రిజర్వేషన్లపై కాషాయ పార్టీ వ్యతిరేకమనే అంశాన్ని బలంగా చెప్పడంలో సక్సెస్ అయ్యారని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది.

Next Story

Most Viewed