ఇన్‌ఫ్లుయెన్సర్స్ ట్యాక్స్ పే చేస్తారా..?

by  |
ఇన్‌ఫ్లుయెన్సర్స్ ట్యాక్స్ పే చేస్తారా..?
X

దిశ, ఫీచర్స్: కమ్యూనికేషన్ నుంచి వినోదం వరకు ఎన్నో అవసరాలకు ఏకైక పరిష్కార మార్గంగా ఉన్న సోషల్ మీడియా.. ఎంతోమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కు అవకాశాలను సృష్టించింది. ఈ క్రమంలోనే పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఎంపికవుతున్న ‘ఇన్‌ఫ్లుయెన్సర్స్’.. సదరు కంపెనీ ఉత్పత్తులు, సేవలను వినియోగదారులకు చేరువ చేయడంలో, వాటిపై అవగాహన పెంచడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. దీంతో స్పాన్సర్‌షిప్స్, యాడ్ రెవెన్యూ సహా అనేక మార్గాల్లో ఇన్‌ఫ్లుయెన్సర్స్ డబ్బు సంపాదిస్తుండగా.. ఈ మొత్తాన్ని కంపెనీ ఆదాయంగానే పరిగణిస్తారు. ప్రామాణిక ఆదాయపు పన్నుకు లోబడే వీరికి కూడా పన్నులు విధిస్తారు. ఈ నేపథ్యంలో భారత్‌లోని యూట్యూబర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్‌పై పన్ను ప్రభావాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

దశాబ్ద కాలంగా విపరీతంగా పెరిగిన సోషల్ మీడియా యూజర్ల సంఖ్య.. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 57 శాతంగా ఉంది. ఈ సంఖ్య సోషల్ మీడియా వినియోగదారుల వ్యయాన్ని ప్రభావితం చేస్తుందనడంతో ఎలాంటి సందేహం లేదు. 50% కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఉత్పత్తులను పరిశోధించడానికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ఉపయోగిస్తారని, 60% కంటే ఎక్కువ మంది సోషల్ మీడియా రిఫరల్స్ ఆధారంగా ఉత్పత్తులు సేవలను కొనుగోలు చేసే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరిన్ని కంపెనీలు ఇప్పుడు సంప్రదాయ ప్రకటనలకు స్వస్తిచెప్పి సోషల్ మీడియాకు మారుతున్నాయి. తమ ఉత్పత్తులు, సేవలను ప్రోత్సహించడానికి ఇన్‌ఫ్లుయెన్సర్స్‌‌పై ఆధారపడుతున్నాయి.

‘సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇండివిడ్యువల్స్‌’గా ఇన్‌ఫ్లుయెన్సర్స్..

మార్కెటింగ్ వ్యూహంలో ‘ప్రభావశీలుర మార్కెటింగ్’ ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఈ క్రమంలోనే ‘యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, స్నాప్‌చాట్, టిక్‌టాక్’ వంటి సోషల్ ప్లాట్‌ఫామ్స్‌పై రెగ్యులర్‌గా పోస్ట్‌లు చేయడం ద్వారా ఇన్‌ఫ్లుయెన్సర్స్ భారీగా ఫాలోవర్స్‌ను సంపాదించుకుంటూ, యాడ్ రెవెన్యూ పెంచుకుంటున్నారు. కాగా ఆదాయాన్ని గడించే ఏ ఇతర వ్యక్తి లేదా కార్పొరేషన్ మాదిరిగానే, ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా పన్ను పరిధిలోకి వస్తారని బ్యూరో ఆఫ్ ఇంటర్నల్ రెవెన్యూ (BIR) పేర్కొంది. కంపెనీలు, పార్ట్‌నర్‌షిప్స్‌ మాదిరి కాకుండా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను ‘సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇండివిడ్యువల్స్‌’గా లేదా వాణిజ్య/వ్యాపారంలో పన్ను ప్రయోజనాల కోసం సోల్ ప్రొప్రైటర్స్‌గా వర్గీకరించారు. అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో స్థూల మొత్తం ఆదాయంలో రూ.1 కోటికి పైగా సంపాదిస్తున్న ప్రభావశీలురు వారి అకౌంట్ బుక్స్ తనిఖీకి లోబడి ఉంటారు.

యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్స్, స్పాన్సర్డ్ సోషల్ అండ్ బ్లాగ్ పోస్ట్‌లు, డిస్‌ప్లే అడ్వర్టైజింగ్, బ్రాండ్ రిప్రజెంటేటివ్ లేదా అంబాసిడర్‌గా మారడానికి, అఫిలియేట్ మార్కెటింగ్, ప్రాజెక్ట్ లైన్‌లను రూపొందించడం, సొంత ఉత్పత్తులను ప్రోత్సహించడం, ఫొటో, వీడియో సేల్స్, డిజిటల్ కోర్సులు, సబ్‌స్క్రిప్షన్స్, ఈ-పుస్తకాలు, పాడ్‌కాస్ట్‌, వెబ్‌లాగ్స్ వంటివన్నీ రెగ్యులర్ ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే బిజినెస్ ఇన్‌కమ్‌కు ఉదాహరణలు. సృజనాత్మకత స్థాయి పెరుగుదలతో, పైన పేర్కొన్న ప్రకటనల రూపాలు కూడా రూపాంతరం చెందుతాయి.

జీఎస్‌టీ అండ్ ఐజీఎస్‌టీ..

ఒక ఆర్థిక సంవత్సరంలో వారి టర్నోవర్ రూ.20 లక్షలుగా లేదా ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల్లో ఉన్నట్లయితే రూ.10 లక్షలు దాటితే యూట్యూబర్ లేదా ఇన్‌ఫ్లుయెన్సర్ తప్పనిసరిగా GST కింద నమోదు చేసుకోవాలి. GST- రిజిస్టర్డ్ యూట్యూబర్స్, బ్లాగర్లు అందించే సేవలపై వర్తించే GST రేటు 18% కాగా (9% సెంట్రల్ ట్యాక్స్ CGST, 9 % స్టేట్ టాక్స్ SGST) లేదా ఆయా రాష్ట్రాల ప్రకారం 18% ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ (IGST) కూడా అమలు చేయొచ్చు.

ఎక్స్‌పోర్ట్ సర్వీస్ విషయంలో, వర్తించే GST రేటు 0%. యూట్యూబర్ లేదా ఇన్‌ఫ్లుయెన్సర్ వారి సేవలను ఎగుమతి చేయడానికి రెండు ఎంపికలు ఉన్నాయి. లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ (LUT)ని అందించడం ద్వారా సేవను ఎగుమతి చేయవచ్చు లేదా IGST చెల్లించి, ఆపై తిరిగి వాపసుగా క్లెయిమ్ చేయవచ్చు. చాలా మంది యూట్యూబర్‌లు ఉపయోగించే గూగుల్ ఇంక్, గూగుల్ యాడ్‌సెన్స్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ప్రకటనలు వస్తుండగా ఆయా కంపెనీ సేవలు భారతదేశానికి వెలుపల ఉన్నందున సప్లయ్ ‘జీరో రేట్’గా పరిగణిస్తోంది.

డిడక్షన్స్..

పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించడానికి ఇన్‌ఫ్లుయెన్సర్ల ఆదాయాల నుంచి వ్యాపార ఖర్చులను తీసివేయవచ్చు, ఇది వారి పన్ను చెల్లింపులను తగ్గిస్తుంది. కెమెరాలు, మైక్రోఫోన్‌ సహా ఇతర సామగ్రి వంటి చిత్రీకరణ ఖర్చులను సంపాదించిన డబ్బులో నుంచి డిడక్ట్ చేసే అవకాశముంది. సబ్‌స్క్రిప్షన్, సాఫ్ట్‌వేర్ లైసెన్సింగ్ ఫీజు, ఇంటర్నెట్, కమ్యూనికేషన్ ఖర్చులు, కార్యాలయ ఖర్చులు, రెంట్, కార్యాలయ సామగ్రి, వ్యాపార ఖర్చులు, రవాణా ఖర్చులు వంటివన్నీ ఇందులో ఇన్‌క్లూడ్ చేసుకోవచ్చు. అడ్వర్టైజింగ్, ప్రమోషన్, డిజైన్, మిక్సింగ్, ఎడిటింగ్, ఎంప్లాయిస్ ఎక్స్‌పెన్సెస్ కూడా ఇందులో చేర్చవచ్చు. ఉపాధికి అవసరమైన వాటికి మాత్రమే పన్ను మినహాయింపు లభిస్తుందని గుర్తుంచుకోవాలి.



Next Story

Most Viewed