ప్లాస్టిక్ విగ్రహాలను ప్రతిష్ఠించవద్దు : మేయర్

by  |
ప్లాస్టిక్ విగ్రహాలను ప్రతిష్ఠించవద్దు : మేయర్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర పరిధిలో ప్లాస్టిక్ విగ్రహాలను నిషేధించినందున ఎవరు ప్రతిష్టించ వద్దని నగర మేయర్ బొంతు రాంమ్మోహన్ కోరారు. ఈ ఏడాది నగర పరిధిలో లక్ష మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంచిపెడతామని ఆయన పేర్కొన్నారు. డివిజన్ల వారిగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భక్తులు మండపాలు ఏర్పాటు చేయకుండా ఇండ్లలోనే ప్రతిమలను నిలుపుకోవాలని సూచించారు.

స్వచ్ఛ్ సర్వేక్షన్‌- 2020 ర్యాంకుల్లో జీహెచ్‌ఎంసీకి మొదటి స్థానం వచ్చిందన్నారు. 40 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో బెస్ట్ సిటిజన్ ఫీడ్ బ్యాక్ కేటగిరీలో ఈ ర్యాంక్ వచ్చిందని తెలిపారు. 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో క్లీన్ లో హైదరాబాద్‌కు 23వ ర్యాంక్, శానిటేషన్ లో 3వ స్థానంలో నిలిచిందని బొంతు రామ్మోహన్‌ ప్రకటించారు.

Next Story