టెన్నిస్ చరిత్రలో జకోవిచ్ సరికొత్త రికార్డు.. 

by  |
టెన్నిస్ చరిత్రలో జకోవిచ్ సరికొత్త రికార్డు.. 
X

దిశ, స్పోర్ట్స్ : అంతర్జాతీయ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఏటీపీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. దీంతో ఏకంగా 311 వారాల పాటు అగ్రస్థానంలో ఉన్న ఏకైక టెన్నిస్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 48 ఏళ్ల ఫెడెక్స్ ఏటీపీ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 311 వారాలు నెంబర్ 1గా నిలిచాడు. అయితే 5 దఫాలుగా జకోవిచ్ ఈ రికార్డును సాధించాడు. అంతకు ముందు 310 వారాల పాటు నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఫెదరర్ రికార్డును అతడు అధిగమించాడు. జకోవిచ్ ఇప్పటి వరకు 18 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు గెలుచుకొని ఫెదరర్, నదాల్ కంటే రెండు చాంపియన్‌షిప్‌ల వెనుక ఉన్నాడు.

36 ఏటీపీ మాస్టర్ ట్రోఫీలు గెలుచుకున్న రికార్డు కూడా జకోవిచ్ పేరిట ఉన్నది. అత్యంత సుదీర్ఘంగా 2014-16 మధ్య 122 వారాల పాటు నెంబర్ 1 స్థానంలో కొనసాగాడు. కాగా ఈ రికార్డు సాధించిన అనంతరం జకోవిచ్ స్పందించాడు. ‘ఫెదరర్, నదాల్ వంటి దిగ్గజ ఆటగాళ్లతో తన ప్రయాణం కొనసాగింది. వారితో తలపడి నేను అగ్రస్థానంలో కొనసాగుతూ ఈ రికార్డు సాధించడం గర్వంగా ఉన్నది. పీట్ సంప్రాస్, ఇవాన్ లెండిల్, జిమ్మీ కానర్స్ వంటి వారినే కాకుండా ఫెదరర్ రికార్డును కూడా అధిగమించడం చాలా సంతోషంగా ఉంది’ అని జకోవిచ్ అన్నాడు. మరింత కాలం ఈ రికార్డును కొనసాగించాలని భావిస్తున్నట్లు జకోవిచ్ తెలిపాడు.

Next Story

Most Viewed