ఎస్‌బీఐలో 30 వేల మంది ఉద్యోగుల తొలగింపు

by  |
ఎస్‌బీఐలో 30 వేల మంది ఉద్యోగుల తొలగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెంది, ఇప్పటికే అనేకమంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున్న పడ్డారు. దాని మూలంగా ప్రస్తుతం దేశంలో అనేక కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ అయిన ఎస్‌బీఐ రెండోసారి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) పథకాన్ని అమలు చేయడానికి సన్నహాలు చేస్తోంది. దీనికి ప్రతిపాదిత పథకం ‘సెకండ్‌ ఇన్నింగ్స్‌ ట్యాప్‌ వీఆర్‌ఎస్‌-2020’ పేరుతో ఒక డ్రాఫ్ట్‌ను రూపొందించింది.

దాదాపుగా 30,190 మంది ఉద్యోగులను ఇంటికి పంపించడానికి చేస్తున్న ప్రతిపాదనలకు త్వరలోనే బోర్డు అనుమతి లభించనుంది. 2020 మార్చి నాటికి ఎస్‌బీఐలో 2.49 లక్షల మంది సిబ్బందికి తగ్గారు. 2019 ఇదే సమయం నాటికి 2.57 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. నూతన వీఆర్‌ఎస్‌లో కటాఫ్‌ తేదీ నాటికి 25 ఏళ్ల సర్వీసు లేదా 55 ఏళ్ల వయసు నిండిన పర్మినెంట్‌ ఆఫీసర్లు, సిబ్బందికి ఇది వర్తించేలా కసరత్తు జరుగుతుంది. మొత్తం 11,565 మంది అధికారులు, 18,625 మంది సిబ్బంది వీఆర్‌ఎస్‌కు అర్హులని సమాచారం.



Next Story

Most Viewed