‘దిశ’ ఎఫెక్ట్: కబ్జాకోరులపై కొరడా ఝుళిపిస్తామన్న అధికారి

by  |
range vasu
X

దిశ, నిజామాబాద్ రూరల్: గత రెండ్రోజుల క్రితం ‘దిశ’ దినపత్రికలో ప్రచురితమైన సిరికొండ మండలం న్యాయన౦ది గ్రామంలో “రిజర్వ్ ఫారెస్ట్ భూములు కబ్జా” అనే కథనానికి స్పందించి సిరికొండ మండలం అడవి రేంజ్ అధికారి వాసు గత రెండు రోజుల నుండి క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అడవి భూమి అన్యాక్రాంతమైంది నిజమేనని కానీ 30 ఎకరాల్లో కాదని కేవలం 7 ఎకరాల్లో కబ్జా అయినట్లు ఆయన తెలిపారు. గత రెండు రోజుల నుండి బీట్, సెక్షన్ అధికారులతో కలిసి పర్యవేక్షణ చేసినట్లు వాసు పేర్కొన్నారు. ఇక నుండి ఆక్రమిత అటవీ భూముల్లో హరితహారంలో భాగంగా చెట్లు నాటుతామని రేంజ్ అధికారి పేర్కొన్నారు.

అదేవిధంగా కబ్జా భూముల్లో అధికారులు, నాయకులకు ఎలాంటి ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు. అటవీ భూములను అన్యాక్రాంతం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. న్యాయనంది గ్రామంలో ఒక్క గజం అటవీ భూమి అన్యాక్రాంతం కాకుండా ఇప్పటి నుండి నిఘా పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే రెవెన్యూ, అటవీ భూముల సర్వే నిర్వహించి అడవి హద్దులను గుర్తించి దిమ్మెలను నిర్మించామని, దిమ్మెలను దాటు కొందరు రైతులు అడవి భూమిని అన్యాక్రాంతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారంగా హరితహారంలో భాగంగా మొక్కలు నాటి అనంతరం (ట్రెంచు) కంచెను ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చేస్తామని ఆయన పేర్కొన్నారు.సెక్ష అధికారితో సెక్షన్ అధికారి శ్రీకాంత్,బిట్ అధికారిణి పర్వీనా బేగం లు ఉన్నారు.

Next Story

Most Viewed