దిశ ఎఫెక్ట్‌.. ప్రభుత్వ ఆస్పత్రిలో అల్పాహారం పంపిణీ

27

దిశ, గోదావరిఖని: గోదావరిఖని శారదానగర్‎లోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో “దిశ” దినపత్రికలో ‘పండుగ అని పేషెంట్లకు అన్నం పెట్టని వైనం’ అనే వార్త ప్రచురితం కావడంతో స్పందించిన గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కంది శ్రీనివాస్ రెడ్డి వెంటనే ఆస్పత్రి సిబ్బందికి ఆదేశాలను జారీ చేశారు. డెలివరీ అయిన బాలింతలకు యుద్ధ ప్రాతిపదికన అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. దీంతో స్పందించిన సూపరింటెండెంట్ తీరుపై ఆస్పత్రిలోని బాలింతల బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. అత్యవసరంగా స్పందించి సూపరింటెండెంట్ ఆదేశానుసారం బాలింతలకు అల్పాహారాన్ని పంపిణీ చేసిన ప్రేమ్ సాగర్‌ను పలువురు అభినందించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..