రేవంత్ రెడ్డి ఒక సెప్టిక్ ట్యాంక్.. ధర్మపురి సంచలన వ్యాఖ్యలు

by  |
రేవంత్ రెడ్డి ఒక సెప్టిక్ ట్యాంక్.. ధర్మపురి సంచలన వ్యాఖ్యలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : బాన్సువాడ, బోధన్ నియోజక వర్గాలకు చెందిన టీఆర్ఎస్ నేతలు బీజేపీలో భారీగా చేరారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో టీఆర్ఎస్ నేతలకు ఎంపీ ధర్మపురి అర్వింద్ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా బీజేపీపై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. సెప్టిక్ ట్యాంక్ లకు నేను దూరంగా ఉంటాను అని రేవంత్ ను ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం కార్యకర్తలు దిక్కు లేరని, డబ్బులిచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు రప్పిస్తున్నారు అని ఆరోపించారు.

దమ్ముంటే రాహుల్ గాంధీ మీద రేవంత్ తన కోపం చూపించాలి అన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ పెరుగుతుంటే.. కాంగ్రెస్ ప్రభావం తగ్గుతోందని అన్నారు. బీజేపీని రేవంత్ ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదని, ఒత్తిడిలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు అనిపిస్తోందని పేర్కొన్నారు. నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరని, పోటీ చేసిన వారికి డిపాజిట్లలో సగం ఓట్లు కూడా రావు అని జోస్యం చెప్పారు. భాజపాలో జాతీయ అధ్యక్షుడి నుంచి సామాన్య కార్యకర్త వరకు అందరూ సమానమే అన్నారు.

మాజీ మేయర్ సంజయ్ తో నాకు ఎలాంటి సంబంధాలు లేవు..

నిజామాబాద్ మాజీ మేయర్, తన సోదరుడు డి. సంజయ్ తో తనకు చిన్నప్పటి నుంచి ఎలాంటి సంబంధం లేదని, ఇక ముందూ ఉండదు అని ఎంపీ అర్వింద్ వ్యాఖ్యానించారు. సంజయ్ లోక్ సభ అభ్యర్థి అయినప్పుడు ఆలోచిద్దాం అన్నారు. బాన్సువాడ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ మాల్యాద్రి రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ లో చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మి నర్సయ్య, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్ పాల్ సూర్య నారాయణ, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story