- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2026:ఉగాది పంచాంగం.. ఏ రాశికి లాభం? ఎవరికీ ఖర్చులు ఎక్కువ?
ఈ ఏడాదిలో 12 రాశుల వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

దిశ,వెబ్‌డెస్క్: ఉగాది పండుగ వచ్చేస్తోంది. ఈ నెల(మార్చి 19)న తెలుగు నూతన సంవత్సరాది మొదటి పండుగైన ‘ఉగాది’ని జరుపుకునేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ రోజు ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వేకువజామునే నిద్రలేచి ఇంట బయట శుభ్రం చేసుకుని, ఆలయాలకు వెళుతారు. అనంతరం ఉగాది పచ్చడి చేసుకుని కుటుంబ సభ్యులందరూ కలిసి మెలసి స్వీకరిస్తారు. ఇక, ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది పంచాంగ శ్రవణం. ఈ రోజు తమ రాశుల వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో, ఈ నూతన సంవత్సరం తమకు ఎలా ఉండబోతుందోనని ఆసక్తిగా పంచాంగం శ్రవణంలో చూసుకుంటారు. ఈ సంవత్సరం రాజు గురువు, మంత్రి కుజుడు, సేనాధిపతి ఆర్గాధిపతి, మేఘాధిపతి చంద్రుడు. కాగా, ఈ పరాభవ నామ సంవత్సరంలో పన్నెండు రాశుల ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. 12 రాశుల వారికి ఆదాయ, వ్యయాలు ఈ విధంగా ఉన్నాయి.
మేష రాశి: ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4.
వృషభ రాశి: ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4.
మిథున రాశి: ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7.
కర్కాటక రాశి:ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7.
సింహ రాశి:ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7.
కన్య రాశి: ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3.
తులా రాశి: ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3.
వృశ్చిక రాశి: ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 6.
ధనస్సు రాశి: ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6.
మకర రాశి:ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2.
కుంభ రాశి:ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2.
మీన రాశి:ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2.
నోట్:పై సమాచారం ఇంటర్నెట్ నుండి తీసుకోబడింది. దీనిని ‘దిశ’ ధృవీకరించలేదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు.






