కార్తీక పౌర్ణమి రోజు.. ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసా?

by Disha Web Desk 6 |
కార్తీక పౌర్ణమి రోజు.. ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: హిందువులు ఎంతో పవిత్రంగా జరుపుకునే కార్తీక మాసం ప్రారంభమైంది. శ్రీ మహావిష్ణువు, శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో భక్తులు దేవాలయాలకు వెళ్లి ప్రత్యేకమైన పూజలు చేస్తుంటారు. కార్తీక మాసం మహావిష్ణువుకు అంకితం చేసిన రోజు. అలాగే పున్నమి తిథి కూడా విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. అందుకే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ పవిత్రమైన రోజు గంగానదిలో స్నానం చేసి దీపాలు వెలిగిస్తే అన్ని శుభాలు జరుగుతాయని జనాలు నమ్ముతుంటారు. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నవంబర్ 26 ఆదివారం నాడు మధ్యాహ్నం 3.53 గంటలకు ప్రారంభం అవుతుంది. అలాగే పౌర్ణమి తిథి నవంబర్ 27 సోమవారం మధ్యాహ్నం 2. 45 గంటలకు ముగుస్తుంది.

కాబట్టి కార్తీక పౌర్ణమిని మనం నవంబర్ 27న జరుపుకుంటున్నాము. అయితే కార్తీక పౌర్ణమి నాడు కొన్ని పనులు చేస్తే చాలా మంచిదని పెద్దలు అంటుంటారు. అలాగే కొన్ని తప్పులు చేయడం వల్ల కూడా చెడు జరుగుతుందట. ఈ రోజు గంగానదిలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి. ఈరోజు అవసరమైన వారికి దానం చేయడం వల్ల పుణ్యం దక్కుతుంది. ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి వస్తుందని నమ్ముతారు. కార్తీక మాసంలో.. తులసిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. కాబట్టి ఈరోజు పొరపాటున కూడా తులసి ఆకులను తెంపకూడదు. అలాగే మాంసాన్ని తినకూడదు. ఆల్కహాల్ సేవించకూడదు. ఎవరిని తిట్టకూడదు.. దూషించకూడదు. ఇలా చేస్తే మీపై విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పనులు చేయకపోవడం మంచిది.

Next Story

Most Viewed