నారదుడు స్త్రీ రూపాన్ని పొందిన అద్భుత క్షేత్రం ఎక్కడ ఉందో తెలుసా..

by Disha Web Desk 20 |
నారదుడు స్త్రీ రూపాన్ని పొందిన అద్భుత క్షేత్రం ఎక్కడ ఉందో తెలుసా..
X

దిశ, వెబ్ డెస్క్ : దేవళ్లు అప్పుడప్పుడూ భూలోకానికి వచ్చి సంచరిస్తూ ఉంటారని పూర్వీకులు చెప్పిన మాట. కొన్ని సార్లు తమ ప్రియమైన భక్తులను పరీక్షించడానికి వస్తే, కొన్ని సార్లు తమకు నచ్చిన ప్రదేశాల్లో విహరించడానికి వస్తూ ఉంటారని పురాణాలు చెపుతున్నాయి. అంతే కాకుండా దేవదేవుళ్లు తమ అవతారాలను మార్చినప్పుడు ఏదో ఒక రూపంలో భూలోక సంచారం చేసేవారు. అదే విధంగా నారదమునీంద్రుడు కూడా ఓ రోజు భూలోకానికి విహారానికి వచ్చాడు.

అలా విహరిస్తూ సాయంత్రం వేళ ఓ కొలనులో స్నానం చేశాడు. తీరా బయటికి వచ్చి చూసుకుంటే స్త్రీ రూపాన్ని దాల్చాడు. అప్పుడు నారదుడు తపస్సు చేసి ఆ నారాయణున్ని ప్రసన్నం చేసుకుని మరల సాధారణ రూపానికి వచ్చాడు. అసలు ఆ కొలను ఎక్కడ ఉంది, నారదుడు నారాయణున్ని ఎక్కడ ప్రసన్నం చేసుకున్నాడు, ఆ ఆలయ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడలో సర్పవరం అనే ఓ గ్రామం ఉంది. ఈ గ్రామంలోనే నారదుడు స్త్రీ రూపాన్ని దాల్చాడని పురాణాలు చెపుతున్నాయి. పూర్వం ఈ గ్రామంలో సర్పాలు ఎక్కువగా ఉండటం వలన ఈ ప్రాంతానికి 'సర్పవరం' అనే పేరు వచ్చిందని స్థానికులు చెపుతుంటారు. ఈ సర్పవరం కథని అగస్త్య మహర్షి సనకసనందనాదులకు చెబుతాడు.

నారదుడు నారాయణున్ని ప్రసన్నం చేసుకున్న ఆలయ చరిత్ర

పూర్వకాలంలో ఇంద్రుడు, ఇతర దేవతలు బ్రహ్మదేవుడితో సమావేశమం అయ్యారట. అప్పుడ ఆ మహావిష్ణువు మాయ గురించి ప్రస్తావించుకుంటారట. ఆ సమావేశంలో విష్ణుమాయను కనుగొనడం ఎవరివల్లాకాదని చర్చించుకున్నారట. అయితే అక్కడే ఉన్న నారదుడు వారితో ఏకీభవించకుండా అనుక్షణం విష్ణు నామాన్ని జపించే తనకి ఆయన మాయను తెలుసుకోవడం సులభమే అని దేవతలతో అన్నాడట. ఈ సంగతి కాస్తా విష్ణుమూర్తి చెవిన పడింది. కొంత కాలం గడిచిన తరువాత ఒకరోజు నారద మునీంద్రుల వారు భూలోకంలో విహరించడానికి వచ్చాడట.

సంధ్యావందన సమయం కావడంతో నారదమునీంద్రుల వారు ఓ కొలనులోకి దిగి స్నానం చేసి బయటికి వచ్చాడట. అప్పుడు నారదుడు తాను స్త్రీగా మారిపోయినట్టు తెలుసుకుని ఆశ్చర్య పోయాడు. గట్టున పెట్టిన వీణ, కమండలం కూడా నారదునికి కనిపించకపోవడంతో అయోమయానికి లోనయ్యాడు. ఎప్పుడైతే నారదుడు స్త్రీ రూపాన్ని ధరించాడో సర్వ శక్తులను కోల్పోయి సాధారణ స్త్రీగా మారిపోయాడు. గతం మరిచిపోయి ఇష్టానుసారంగా తిరగసాగాడు.

స్త్రీ రూపంలో ఉన్న నారదున్ని పిఠాపురం పాలకుడు నికుంఠ మహారాజు ఒక నాడు చేసి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత ఓ నాడు యుద్దంలో నికుంఠ మహారాజు శత్రు రాజుల చేతిలో చనిపోయాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడు పారిపోయి అడవుల్లో తిరుగుతూ ఆకలితో ఓ చెట్టు నుంచి పండును కోయడానికి ప్రయత్నిస్తూ, అది అందక ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మారువేషంలో అక్కడికి వచ్చి అక్కడికి దగ్గరలో ఉన్న కొలనులో స్నానం చేసి వస్తే తనకి ఆ పండు అందుతుందని చెప్పాడు.

అప్పుడు నారద స్త్రీ కొలనులోకి వంగిన ఓ చెట్టు కొమ్మను పట్టుకుని నీళ్ళలోకి దిగి ఓ మునక వేస్తుంది. దాంతో నారదమునీంద్రునికి స్త్రీ రూపం పోయి నారద రూపం వస్తుంది. కానీ చెట్టు కొమ్మని పట్టుకోవడం వలన నారదున్ని చేతులు తడవకపోవడంతో స్త్రీ చేతి గాజులు అలాగే ఉన్నాయి. ఆ తరువాత నారదుడు తన చేతులను ఆశ్చర్యంగా చూసుకుంటూ ఒడ్డుకువస్తాడు. అప్పుడు ఆలోచించగా ఆలోచించగా అదంతా విష్ణుమాయ అని అర్థమైంది.

అప్పుడు శ్రీ మహా విష్ణువు అనుగ్రహం కోసం ఈ ప్రదేశంలో పాతాళ భావనారాయణ స్వామిని ప్రతిష్ఠించి, వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు, ఆయన మాయకు ప్రత్యక్ష సాక్ష్యంగా ఆ ప్రదేశంలో కొలువుదీర వలసిందిగా నారదుడు కోరి భావనారాయణ స్వామిగా ఆయన అక్కడే వెలిశాడు. ఆ తరువాత రాజ్య లక్ష్మీ అమ్మవారిని స్వామివారికి ఎదురుగా ప్రతిష్ఠించారు.

ఇవి కూడా చదవండి :

రావణున్ని దేవునిగా పూజించే జిల్లా ఇదే.. ఎత్తైన విగ్రహం కూడా


Next Story

Most Viewed