అమర్‌నాథ్ యాత్రికులకు బంపరాఫర్.. ఇక నడవాల్సిన పనిలేదు!

by Disha Web Desk 7 |
అమర్‌నాథ్ యాత్రికులకు బంపరాఫర్.. ఇక నడవాల్సిన పనిలేదు!
X

దిశ, వెబ్‌డెస్క్: హిందువులు సందర్శించే పుణ్యక్షేత్రాలలో అమర్‌నాథ్ గుహ ఒకటి. ఈ టెంపుల్ భారత్‌లోని జమ్మూ కాశ్మీర్‌లో ఉంది. హిమాలయాల్లోని దక్షిణ కొండల్లో ఉన్న ఈ క్షేత్రానికి పహల్గాం గ్రామం నుంచి వెళ్లాలి. అయితే ప్రతి సంవత్సరం జులై సమయంలో అమర్‌నాథ్ గుహలో మంచు శివలింగం ఏర్పడుతోంది. సహజ లింగ రూపంలో ఉన్న మహాదేవుణ్ని దర్శించుకునేందుకు ఇండియా నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు పోటెత్తుతారు. ఐతే భక్తులు గుహను చేరుకోవడం అతి పెద్ద సమస్యగా మారుతోంది. గందేర్బల్ జిల్లాలోని బల్తార్ బేస్ లేదా అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాం బేస్ నుంచి భక్తులు నడుస్తూ వెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే కొంతమంది గాడిదలు, గుర్రాలపై వెళ్తుంటే.. మరికొందరు డోలీల సాయంతో వెళ్తారు. ఇక హోదా, డబ్బు, పలుకుబడి ఉన్న వాళ్ల గురించైతే చెప్పనవసరం లేదు. ప్రత్యేక హెలికాప్టర్లలో వెళ్తుంటారు.

ఇక ఎలా వెళ్లినా కూడా ఈ యాత్ర ఎన్నో సవాళ్లతో, ప్రమాదాలతో కూడుకుని ఉంటుంది. చుట్టూ మంచు, సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతుంటారు. కొన్ని కొన్ని సార్లు ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. తాజాగా ఈ సమస్యలకు పరిష్కారం చూపించింది అక్కడి గవర్నమెంట్. జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన తర్వాత.. భక్తుల సౌకర్యార్థం బల్తాల్ బేస్ నుంచి అమర్నాథ్ గుహ వరకు రోడ్డును నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం 2022 సెప్టెంబర్‌లో నిర్ణయించుకుని.. ఇటీవల రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. తాజాగా రోడ్డు నిర్మాణం పూర్తయింది. అంతే కాకుండా ట్రైయల్ వెర్షన్‌లో భాగంగా సోమవారం తొలిసారి కొన్ని వాహనాలను బల్తార్ బేస్ నుంచి అమర్నాథ్ గుహ వరకు తీసుకెళ్లారు. అంతా అనుకున్నట్లే సజావుగా సాగింది. అందువల్ల ఈ సారి అమర్ నాథ్ గుహకు వెళ్లేవారికి ఈ యాత్ర అత్యంత సౌకర్యవంతంగా సాగడమే కాదు.. చాలా త్వరగా పూర్తవ్వనుందని భక్తులకు శుభవార్త తెలిపారు.



Next Story

Most Viewed