- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముక్కోటి ఏకాదశి రోజున ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం.. ఈ పనులు అస్సలు చేయకండి
రేపే ముక్కోటి ఏకాదశి. ముక్కోటి దేవతలు శ్రీమహావిష్ణువుతో కలిసి భూమ్మీదకి వస్తారని, ఈ రోజున ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే..

దిశ, వెబ్‌డెస్క్: రేపే ముక్కోటి ఏకాదశి. ముక్కోటి దేవతలు శ్రీమహావిష్ణువుతో కలిసి భూమ్మీదకి వస్తారని, ఈ రోజున ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే పుణ్యమని పురాణాలు చెప్తున్నాయి. ఈ పర్వదినం రోజున కొన్ని పనులు చేయకపోవడమే మంచిదంటున్నారు పండితులు. మరికొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని చెప్తున్నారు.
వైకుంఠ ఏకాదశి రోజున చేయకూడని పనులు
పవిత్రంగా భావించే వైకుంఠ లేదా ముక్కోటి ఏకాదశి రోజున తులసి ఆకులను కోయడం మంచిది కాదు. విష్ణువుకు ఈ తులసి ఆకు అంటే ఎంతో ఇష్టం. ఆయనకు తులసి ఆకులతో పూజలు చేస్తే మంచిది. అందుకోసం ముందురోజే ఆకుల్ని కోసి పెట్టుకోవాలని సూచిస్తున్నారు.
ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవారు అన్నం, బియ్యంతో చేసిన ఆహార పదార్థాలను తినకూడదు. ఈ రోజున బియ్యంలో మురాసురుడనే రాక్షసుడు ఉంటాడని, అందుకే అన్నంతో చేసిన పదార్థాలను తినకూడదని చెప్తారు.
అలాగే ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారానికి దూరంగా ఉండటం మంచిది. కేవలం సాత్విక ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం.
పగటిపూట నిద్రపోవడం మంచిది కాదంటారు. హరినామ స్మరణతో ఉపవాసం చేసి, పండ్లు, పాలతో సాయంత్రం ఉపవాసాన్ని వీడాలి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి.
వైకుంఠ ఏకాదశిన చేయాల్సిన పనులు
వైకుంఠ ఏకాదశి రోజున పేదలకు ఎవరికి తోచిన సహాయం వారు చేస్తే మంచిది. ఉపవాసంతో పాటు, రాత్రంతా జాగరణ చేస్తే పుణ్యం కలుగుతుందని నమ్మకం. విష్ణుమూర్తిని స్తుతిస్తే..మోక్షం కలుగుతుంది.
ఏకాదశిరోజున ఉపవాసం ఉన్నవారు.. ద్వాదశినాడు అతిథి లేకుండా భోజనం చేయకూడదు. ఎవరైనా అతిథికి భోజనం పెట్టాక భోజనం చేయాలి.
ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే.. కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని నమ్మకం. గోసేవ, పురాణ శ్రవణం, దానధర్మాలు చేయడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుంది.
వైకుంఠ ఏకాదశిరోజున లక్ష్మీ కటాక్షం కలగాలటే.. ధాన్యం, దుప్పటి, తులసిమొక్క, దుస్తులు వంటి వాటిని పేదలకు దానం చేయాలి. ఆర్థిక సహాయం చేస్తే విష్ణువు, లక్ష్మీదేవిల అనుగ్రహం పొందవచ్చు. గోవును దానమిస్తే శుభఫలితాలు కలుగుతాయి.






