AP News: పోలవరంపై ప్రభుత్వం చెబుతున్నవి కాకి లెక్కలే : దేవినేని ఉమా

by  |
devineni
X

దిశ, ఏపీ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేస్తామంటూ పదే పదే మాటలు చెబుతున్న జగన్ ప్రభుత్వం పోలవరం పనులు ఎంత వరకు పూర్తి చేసిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన పోలవరం ప్రాజెక్టు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని విమర్శించారు. టీడీపీ హయాంలో పూర్తి చేసిన ప‌నులే ఇప్పటి వ‌ర‌కు ఉన్నాయని చెప్పుకొచ్చారు. పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు ఏ మాత్రం ముందుకు సాగ‌ట్లేదన్నారు.

74% నుంచి 77% శాతానికి ప‌నులు పూర్తి చేసిన‌ట్లు ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని విమర్శించారు. ఎగువ కాపర్ డ్యామ్‌, దిగువ కాపర్ డ్యామ్ ప‌నులు అప్పుడు పూర్తి చేసిన లెక్కలే ఇప్పటికీ ఉన్నాయన్నారు. క‌మీష‌న్లకు ఆశ‌ప‌డ్డామ‌ని త‌మ‌పై అప్పట్లో వైసీపీ నేత‌లు త‌ప్పుడు ప్రచారం చేశార‌ని.. మరి ఇప్పుడు వైసీపీ నేతలు ఏం చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రశ్నించారు.



Next Story

Most Viewed