బంగాళాఖాతంలో వాయుగుండం.. ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..

2853

దిశ, వెబ్ డెస్క్ : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మంగళవారం అల్పపీడనం గా మారనుంది. సముద్ర తీర ప్రాంతాల పై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది. దీని ప్రభావం ఎక్కువగా దక్షిణ కోస్తా నుంచి తమిళనాడు వరకూ ఉంటుందని వాతావరణ శాఖ అంచనా. చెన్నైకి సుమారు 400 కి.మీ దూరంలోనే ఈ అల్ప పీడనం ఏర్పడిందని , మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. వేగంగా కదులుతూ గురువారం నాటికి ఉత్తర తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో నాలుగైదు రోజుల పాటు ఉత్తర తమిళనాడు ప్రాంతం, దక్షిణ కోస్తా ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఈ రోజూ రేపు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని, గంటకు 60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక గుంటూరు, కృష్టా, ప్రకాశం, రాయలసీమ లలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. సముద్రం లో అలల తాకిడి ఎక్కువగా ఉందని, చేపల వేటకు ఎవరూ వెళ్లకూడదని రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్‌ కె.కన్నబాబు తెలిపారు.