క‌లెక్ట‌ర్ ఎంట్రీతో న‌వాబు కోట‌కు బీట‌లు

by  |
క‌లెక్ట‌ర్ ఎంట్రీతో న‌వాబు కోట‌కు బీట‌లు
X

దిశ‌, వికారాబాద్‌:హైద‌రాబాద్ న‌గ‌రానికి చేరువ‌లో ఉన్న వికారాబాద్ అంటే తెలియ‌ని వారుండ‌రు. వికారాబాద్ అట‌వీ ప్రాంతానికి పెట్టింది పేరు.. అనంత‌గిరి కొండ‌లు. దామ‌గుండం అట‌వీ ప్రాంతాలు ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్శిస్తాయి. ప‌ర్యాట‌కుల తాకిడి ఎక్కువ‌గా ఉండ‌టంతో అట‌వీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న భూముల‌పై క‌బ్జాకోరుల క‌న్ను పడింది. ఎక‌రా.. రెండు ఎక‌రాలు కాదు..ఏకంగా 170 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని క‌బ్జా చేశాడు. క‌బ్జా చేసిన భూమిలో నిర్మాణాలు చేప‌ట్టి విలాస‌వంత‌మైన జీవితం గ‌డుపుతూ అసాంఘీక కార్య‌క్ర‌మాల‌కు తెర‌లేపాడు న‌గ‌రానికి చెందిన ఓ న‌వాబు. న‌వాబు పేరు ఎత్తాలంటేనే చుట్టుప‌క్క‌ల గ్రామాల ప్ర‌జ‌లు వ‌ణికిపోతారు.

వికారాబాద్ మున్సిప‌ల్ ప‌రిధిలోని 101 స‌ర్వే నెంబ‌రులో 240.35 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి ఉంది. ఈ స‌ర్వే నెంబ‌రులో గ‌తంలో కొంత‌మంది రైతుల‌కు దాదాపు 70 ఎక‌రాలు అప్ప‌టి ప్ర‌భుత్వం పంపిణీ చేసింది. న‌గ‌రానికి చెందిన సుజాద్ న‌వాబు అనే బ‌డా బాబు అసైన్డ్ భూమి పొందిన కొంద‌రి రైతుల వ‌ద్ద నుంచి లీజ్ అగ్రిమెంట్ చేసుకుని 10 ఎక‌రాల వ‌ర‌కు రైతుల వ‌ద్ద నుంచి కొనుగోలు చేశాడు. అంత‌టితో ఆగ‌కుండా మిగ‌తా 170 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని క‌బ్జా చేశాడు. ఆ ప్రాంతం అంతా ద‌ట్ట‌మైన అడవిని త‌ల‌పిం చ‌డంతో ఆ ప్రాంతానికి ఎవ‌రు వెళ్లే వారు కాదు. దీంతో న‌ వాబు గుర్రాలు పెంచి, నిర్మాణాలు చేప‌ట్టి విలాస వంత మైన జీవితం గ‌డుపుతున్నాడు. సొంతగా ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని త‌న ప‌రిస‌రాల‌కు ఎవ‌రూ రాకుండా కాప‌లా ఉంచుకున్నాడు. ఎవ‌రైన అటు వెలితే వారిపై దాడులు చేయించే వార‌ని చుట్టూర గ్రామాల ప్ర‌జ‌లు చెబుతున్నారు.

చీక‌టి రాజ్యానికి రారాజు ఆ న‌వాబు..

బాబాను తలపించేలా న‌వాబు ఘ‌ట‌న‌లు ఉన్నాయ‌ని కొత్రేప‌ల్లి గ్రామ‌స్తులు చెబుతున్నారు. క‌బ్జా చేసిన భూమి అట‌వీ ప్రాంతంలా ఉండ‌టంతో అటుగా ఎవ‌రు ధైర్యం చేసి వెళ్ళేవారు కాదు. తుపాకీ కాల్పులు, ఆడ పిల్ల‌ల అరుపులు, వంటి అరుపులు వినిపించేవ‌ని గ్రామ‌స్తులు వాపోతున్నారు. సుజాద్‌ నవాబ్ పేరు వింటేనే సామాన్యుని నుంచి ప్రజాప్రతినిధి వరకు హడలు ఉండేద‌ని గ్రామ‌స్తులు పేర్కొంటున్నారు. కొత్రేపల్లి గ్రామస్తులకు నవాబ్ అంటే గజగజ ఆ ఫౌంహౌస్ వైపు అడుగుపెట్టాలంటే వణుకు. చీక‌టి సా మ్రాజ్యాన్ని స‌'ష్ఠించి దానికి రారాజులా వ్య‌వ‌హ‌రించాడ‌ని గ్రామ‌స్తులు పేర్కొంటున్నారు. వేరే ప్రాంతాల నుంచి అమ్మాయిల‌ను తీసుకువ‌చ్చి అగాయిత్యాల‌కు పాల్ప‌డే వార‌ని, స‌సేమిరా అంటే క‌నిపించ‌కుండా చేసేవారు గ్రామ‌స్తులు భ‌యం భ‌యంగా చెబుతున్నారు. అటు ప‌క్క ఎవ‌రైన వెళ్ళితే త‌మ కాప‌లాదారుల‌తో దాడులు చేయించేవార‌ని గ్రామ‌స్తులు తెలిపారు.

క‌లెక్ట‌ర్ ఎంట్రీతో న‌వాబు కోట‌కు బీట‌లు..

20 ఏళ్లుగా ఆడిందే ఆట‌.. పాడిందే పాట‌గా న‌వాబు తీరు ఉండేంది. క‌బ్జా భూమిని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు వెలితే కోర్టు స్టే తెచ్చుకునేవాడు న‌వాబు. ఇత‌ర వ్య‌క్తులు వెలితే దాడులు చేయించేవాడు. వికారాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ పౌసుమీ బ‌సు రావ‌డంతో న‌వాబు ఆట‌కు చెక్ ప‌డింది. న‌వాబుకు తెలియ‌కుండా ఉన్న‌తాధికారుల‌తో చ‌ర్చించి కోర్టు స్టేను ర‌ద్దు చేయించి జ‌న‌వ‌రి 30 న ఉద‌ యాన్నే పోలీసుల స‌హ‌కారంతో ఫాం హౌజ్ నిర్మాణాల‌ను కూల్చివేయించారు. దీంతో క‌లెక్ట‌ర్‌పై స్థానిక ప్ర‌జ‌లు, ఇత‌రులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Next Story

Most Viewed