ఆక్సిజన్ కొరతపై హైకోర్టు ఆందోళన

by  |
ఆక్సిజన్ కొరతపై హైకోర్టు ఆందోళన
X

న్యూఢిల్లీ : కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ దొరక్క దేశం మొత్తం విలపిస్తున్నదని ఢిల్లీ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోని పలు రాష్ట్రాలలో ఆక్సిజన్ కొరతతో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో కోర్టు స్పందించింది. ఈ సమస్య నివారణకు నిపుణులు, మేధావుల సలహా తీసుకోవాలని సూచించింది. ఆక్సిజన్ ట్యాంకర్ల నిర్వహణ, వాటి ఉత్పత్తి, సరఫరా వంటి విషయాలపై మేధావులు.. ఐఐటీ, ఐఐఎం నిపుణుల సలహాలు తీసుకోవాలని కేంద్రానికి తెలిపింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఢిల్లీకి 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేయాలని ఆదేశించింది.


Next Story

Most Viewed