మద్యపానం: 21 ఏళ్లకు తగ్గింపు

by  |
మద్యపానం: 21 ఏళ్లకు తగ్గింపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదముద్ర వేసింది. దేశ రాజధాని ఢిల్లీలో మద్యం సేవించేందుకు చట్టబద్ధమైన వయస్సును 21 ఏళ్లకు తగ్గించింది. గతంలో ఇది 25 ఏళ్లుగా ఉండేది. ఇక నుంచి మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహించకూడదని, ప్రైవేట్ వ్యక్తులకే అప్పగించాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.

ఢిల్లీలో కొత్తగా మద్యం షాపులకు అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. 21 ఏళ్లలోపు వారికి మద్యం షాపుల వద్దకు అనుమతి లేదంది. ఇప్పటివరకు దాదాపు 60 శాతం మద్యం దుకాణాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి. ఇప్పుడు వాటిని ప్రైవేట్ వ్యక్తుల చేతికి ప్రభుత్వం అప్పగించనుంది.

Next Story