కరోనాతో దెగ్లూర్ ఎమ్మెల్యే మృతి

525

దిశ ప్రతినిధి, నిజామాబాద్: మహారాష్ట్ర నాందేడ్ జిల్లా దెగ్లూర్ / బిలోలి అసెంబ్లీ నియోజకవర్గం శాసన సభ్యులు రావుసాహెబ్ అంతపుర్కర్(55) కరోనాతో మృతి చెందాడు. ముంబాయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కొవిడ్ తో చికిత్స పోందుతూ మరణించినట్లు సమాచారం. దెగ్లూర్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం. దెగ్లూర్ నియోజకవర్గంకు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ, బోధన్ నియెజకవర్గాలు సరిహద్దులుగా ఉన్నాయి.

దెగ్లూర్ ఎమ్మెల్యే అకస్మిక మరణం పట్ల నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు తమ సంతాపం తెలిపారు. కాంగ్రెస్ కు చెందిన రావు సాహెబ్ అంతపుర్కర్ గడిచిన శాసన సభ ఎన్నికలలో తొలిసారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇటీవల కరోనా సోకిన తరువాత తాను తన ఆరోగ్యం పట్ల చాలా నిర్లక్ష్యం వహించారు. అదే తన ప్రాణాల మీదకు తెచ్చినట్లు తెలుస్తుంది. వారం రోజుల క్రితం నాందేడ్ జిల్లా దెగ్లూర్ కు చెందిన మాజీ మంత్రి, మాజీ ఎంపీ గంగాధర్ రావు దేశ్ ముఖ్ సైతం వైరస్ తో మరణించారు. మహరాష్ట్రలో కరోనా వైరస్ తో సాధరణ ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు ప్రాణాలు వదిలారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..