డిన్నర్‌కు వెళ్లిన దీపికకు అభిమానితో చేదు అనుభవం!

97

దిశ, సినిమా: సెలబ్రిటీలు అంటే ఆడియన్స్ స్పెషల్ అటెన్షన్ చూపిస్తారు. వారిని చూడాలని.. మాట్లాడాలని.. కుదిరితే ఫొటో కూడా దిగాలని అనుకుంటారు. ఇక స్టార్స్ పబ్లిక్ ప్లే్స్‌లకు వస్తే చాలు ఎగబడిపోతారు. ఈ కారణంగా పలుమార్లు స్టార్స్ ఇబ్బందులు పడినా.. ఇదంతా అభిమానమేనని సర్దుకుంటారు. ఈ క్రమంలో ముంబైలోని ఓ రెస్టారెంట్‌కు డిన్నర్‌కు వెళ్లిన దీపికా పదుకొనేకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. తను రెస్టారెంట్‌లోనే ఉందన్న విషయం తెలుసుకున్న అభిమానులు బయట గుమిగూడారు. తను బయటకు రాగానే షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు, మాట్లాడేందుకు ట్రై చేశారు. అయితే దీపికా వీటన్నింటికి రెస్పాండ్ అవకుండా కారు ఎక్కే ప్రయత్నం చేయగా.. ఓ మహిళా అభిమాని బ్యాగ్ లాగేసింది. దీంతో దీపిక కాస్త కంగారుపడ్డా, ఫైనల్‌గా బ్యాగ్ తీసుకుని కారు ఎక్కేసింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..