జెర్సీ గిఫ్ట్.. వార్నర్ మనసు గెలిచిన విరాట్

by  |

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అందరిలో క్రీడాస్ఫూర్తిని నింపుతూనే ఉంటారు. అదే స్ఫూర్తితో భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాధించుకున్నాడు. అంతేకాదు అతడు చేసే పనులతో ఎంతోమంది ప్రముఖ క్రీడాకారులకు మనస్సుకు దగ్గరయ్యాడు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్‌కు కూడా కోహ్లీ మరింత దగ్గరయ్యాడు. ఇటీవల ఆసీస్‌ గడ్డపై భారత జట్టు విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఆస్ట్రేలియా హార్డ్ హిట్టర్ డేవిడ్ వార్నర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికరమైన పోస్టు పెట్టాడు. తాము సిరీస్‌ ఓడిపోయినప్పటికీ.. కోహ్లీ పంపిన బహుమతికి ఆ బాధను మరిచిపోయామని చెప్పుకొచ్చాడు.

ఇంతకీ ఆ బహుమతి ఏంటి అనుకుంటున్నారా.. డేవిడ్ వార్నర్ కూతురికి విరాట్ కోహ్లీ తన జెర్సీని పంపాడు. ఇక ఆ జెర్సీ ధరించిన వార్నర్ గరాల పట్టి ఎంతో మురిసిపోయింది. ఇటీవల కోహ్లీ ఆటతీరు ఎంతో ఇష్టమని డేవిడ్ వార్నర్ కూతురు చెప్పడంతో బహుమతిగా జెర్సీ పంపినట్టు తెలుస్తోంది. దీంతో ఇన్‌స్టా వేధికగా స్పందించిన వార్నర్.. తాము సిరీస్ ఓడిపోయినప్పటికీ.. తన కూతురు కోహ్లీ పంపిన జెర్సీతో మురిసిపోయిందని.. తన చిట్టి తల్లిని చూసిన ఆ క్షణమే తన బాధ మొత్తం పోయిందని.. కోహ్లీ మనసును గెలిచాడని వార్నర్ కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed