అది కఠిన నిర్ణయమే : టామ్ మూడీ

by  |
అది కఠిన నిర్ణయమే : టామ్ మూడీ
X

దిశ, స్పోర్ట్స్ : డేవిడ్ వార్నర్‌ను తుది జట్టు నుంచి తప్పించడం చాలా కఠినమైన నిర్ణయం అని సన్‌రైజర్స్ హైదరాబాద్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ టామ్ మూడీ అన్నారు. తుది జట్టులోకి ఎవరిని తీసుకోలనే విషయంపై సుదీర్ఘ చర్చ జరిగిందని.. అయితే ఎవరో ఒకరిని తప్పించాల్సి ఉంటుంది కాబట్టి కఠిన నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ నిర్ణయం తర్వాత డేవిడ్ వార్నర్ షాక్‌కు గురయ్యాడని.. తన అసంతృప్తిని కూడా వెల్లడించాడని టామ్ మూడీ తెలిపాడు. ఇలాంటి నిర్ణయంతో ఏ ఆటగాడైనా అసంతృప్తి చెందుతాడు.. అయితే జట్టు అవసరాలకు కోసం తప్పలేదని మూడీ చెప్పాడు.

కాగా, ఈ సీజన్‌లో డేవిడ్ వార్నర్ సారథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 మ్యాచ్‌లు ఆడగా ఐదింటిలో ఓడిపోయింది. వార్నర్ బ్యాటింగ్ కూడా అంచనాలను అందుకోలేదు. కేవలం 110 స్ట్రైక్ రేటుతో పరుగులు సాధించడంతో జట్టుకు భారంగా మారింది. దీంతో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించి కేన్ విలియమ్‌సన్‌కు బాధ్యతలు అప్పగించారు.



Next Story

Most Viewed