వరద సాయంపై కేటీఆర్‌కు దాసోజు శ్రవణ్ లేఖ

by  |
Congress leader Dasoju Shravan
X

దిశ, తెలంగాణ బ్యూరో : ”దాదాపు 5లక్షల మంది అక్టోబర్ 2020 వరద బాధితులు నష్ట పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు.. నష్ట పరిహారం ఎప్పుడు చెల్లిస్తారో మంత్రి కేటీఆర్ చెప్పాలి… జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు వాగ్దానం చేసిన వరద సాయాన్ని యుద్ధప్రాతిపాదికన విడుదల చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఆదివారం పరిహారం చెల్లించాలని కోరుతూ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో గ్రేటర్ హైదరాబాద్ మరోసారి నీట మునిగిందని, వేలాది కుటుంబాలు మరోసారి రోడ్డున పడ్డాయని, దాదాపు రూ.200 కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా అన్నారు.

మలక్‌పేట, ఎల్‌బీ నగర్, ఉప్పల్, ఓల్డ్ సిటీలోని కొన్ని ప్రాంతాలు, జీహెచ్‌ఎంసీలోని ఇతర ప్రాంతాల్లో ఎక్కవగా నష్టం జరిగిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం గత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోలేదని ఆరోపించారు. డ్రైనేజీ వ్యవస్థ, రెయిన్ వాటర్ డ్రెయిన్ స్ట్రక్చర్స్ వంటి సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాల్సి ఉన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం మొద్దు నిద్రతో మరో వరదకు ప్రజలను బాధితులుగా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాజా వరదలకు నష్టపోయిన వారిని ఆదుకునేలా ప్రభుత్వం పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల కోడ్ నెపంతో సాయాన్ని ప్రభుత్వం నిలిపివేసిందని, కేసీఆర్, కేటీఆర్ మాత్రం గ్రేటర్ లో 6.56 లక్షల మంది వరద బాధితులకు ఇప్పటికే రూ.656 కోట్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారన్నారు. ఈ లెక్క అనుమానంగా ఉందని, లబ్ధి పొందిన వారి వివరాలు జీహెచ్ఎంసీ డొమైన్ లో లేవు అని ఆరోపించారు. ఎన్నికలు పూర్తికాగానే అర్హత ఉన్నవారందరికీ రూ.10వేలు ఇస్తామని హామీ ఇచ్చారని, అందుకుగాను మరో రూ.250-350 కోట్లు అంతకంటే ఎక్కువ చెల్లించాడానికి సిద్ధంగా ఉన్నామని వాగ్దానం సైతం చేశారన్నారు. కానీ గ్రేటర్ ఎన్నికలు డిసెంబర్ 7న ముగిసినా ఇప్పటి వరకు ఏ ఒక్క దరఖాస్తు దారుడికి వరదసాయం అందజేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బాధితులకు నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లబ్ధి పొందిన వారి వివరాలు వార్డ్, డివిజన్ వారిగా జాబితాను జీహెచ్ఎంసీ సైట్ లో పారదర్శకంగా ఉంచాలని, అర్బన్ డెవలప్ మెంట్ పాలసీ ఏర్పాటు చేసి పెండింగ్ లో ఉన్న డ్రైనేజీ, నాలా వైడింగ్, మ్యాన్ హోల్స్, ఓపెన్ నాళా సమస్యలను పరిస్కారించాలని కోరారు.



Next Story

Most Viewed