వేలానికి డార్విన్ మైక్రోస్కోప్

by  |
వేలానికి డార్విన్ మైక్రోస్కోప్
X

దిశ, ఫీచర్స్ : భూమిపై జీవజాలం ఎలా పరిణామక్రమం చెందిందనే అంశంపై పరిశోధనలు చేసి, జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి చార్లెస్ డార్విన్.. విజ్ఞాన శాస్త్రంలో డార్విన్ సిద్ధాంతాన్ని మౌలికమైన భావనగా భావిస్తారు. అయితే డార్విన్ పరిశోధనలో పలు మైక్రోస్కోపులు ఉపయోగించగా, తాజాగా అందులో ఒకదాన్ని వేర్ హౌస్ క్రిస్టీస్ అనే అక్షన్ హౌజ్ వేలం వేయనుంది. ఈ పరికరాన్ని చార్లీస్ గౌల్డ్ 1825లో క్యారీ సంస్థ కోసం రూపొందించిన డార్విన్.. తను వినియోగించిన తర్వాత తన కుమారుడు లియోనార్డ్‌కు ఇచ్చాడు.

200ఏళ్లుగా లియోనార్డ్‌ దగ్గరే ఉన్న మైక్రోస్కోప్‌ను ఈ ఏడాది డిసెంబర్‌లో వేలం వేయనుండగా.. $ 480,000 వరకు అమ్ముడవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డార్విన్ ఈ పరికరాన్ని 1825-30లలో తన సూక్ష్మ ప్రపంచాన్ని పరిశీలించడానికి, అలాగే జూఫైట్‌లు, పగడపు, సముద్ర ఎనిమోన్ వంటి జీవులను అధ్యయనం చేయడానికి ఉపయోగించినట్లు పరిశోధకులు భావిస్తున్నారు. అంతేకాదు తన కుమారుడు ఈ మైక్రోస్కోప్ కలిగిఉండటం తన అదృష్టమని, ఎంతో సంతోషకరమైన విషయమని డార్విన్‌కు లేఖ రాయడం విశేషం. ఇక ఈ వేలంలో ‘విలువైన పుస్తకాలు & మాన్యుస్క్రిప్ట్స్ కూడా వేలం వేయనున్నాం. సైన్స్ చరిత్రలో చార్లెస్ డార్విన్ పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. డార్వినినా (డార్విన్‌కు సంబంధించి) కోసం కలెక్టర్లు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు’ అని జేమ్స్ హిస్లాప్ క్రిస్టీస్‌ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్, గ్లోబ్స్ & నేచురల్ హిస్టరీ విభాగాధిపతి తెలిపారు.

Advertisement
Next Story

Most Viewed