ఎమ్మెల్యేపై దాడి అప్రజాస్వామికం

by  |
ఎమ్మెల్యేపై దాడి అప్రజాస్వామికం
X

దిశ, ఆందోల్: ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై సిద్దిపేటలో జరిగిన దాడిని నిరసిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మంగళవారం నియోజకవర్గ పరిధిలోని ఆందోల్, పుల్కల్, రాయికోడ్, మునిపల్లి, వట్‌పల్లి, రేగోడు, అల్లాదుర్గం, టేక్మాల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లో రహదారులపై రాస్తారోకో చేపట్టారు. జోగిపేటలో రెండుగంటల పాటు దుకాణాలు మూసివేయించి, నిరసన ర్యాలీని చేపట్టారు. బీజేపీ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేసి, దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అనంతరం జోగిపేటలో తహసీల్దార్ ప్రభుకు వినతిపత్రాన్ని సమర్పించారు. అంతేగాకుండా ఎమ్మెల్యేపై దాడి అప్రజాస్వామికమని ఆందోల్ జర్నలిస్టుల సంఘాలు దాడిని ఖండించాయి.



Next Story