నాలుగు నెలల్లో రూ. 31 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద!

by  |
నాలుగు నెలల్లో రూ. 31 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద!
X

దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్-19 సంక్షోభం కారణంగా గతేడాది స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. ఆ తర్వాత తక్కువ సమయంలో పుంజుకుని అంచనాలను మించి ర్యాలీ చేశాయి. మార్కెట్ల దూకుడుతో బీఎస్ఈలో నమోదైన కంపెనీల విలువ 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో రూ. 31 లక్షల కోట్లు పెరిగాయి. చారిత్రాత్మక నష్టాల నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్లోని మదుపర్ల సంపద రికార్డు స్థాయిలో పెరుగుతోంది.

తాజా గణాంకాల ప్రకారం.. కరోనా మహమ్మారి ప్రతికూలత, నియంత్రణ ఆంక్షలు ప్రభావాన్ని అధిగమించి వీరి సంపద రూ. 31 లక్షల కోట్లు పెరిగాయి. జులై 30 నాటికి బీఎస్ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 2,35 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రస్తుత ఏడాది ఏప్రిల్-జులై మధ్య నాలుగు నెలల్లో బీఎస్ఈ సెన్సెక్స్ మొత్తం 3,077 పాయింట్లు పెరిగింది. అలాగే, గత ఆర్థిక సంవత్సరం నుంచి సెన్సెక్స్ మొత్తం 20,040.66 పాయింట్లు పుంజుకుంది.

దీంతో బీఎస్ఈ నమోదిత కంపెనీల విలువ రూ. 90,82,057 కోట్ల నుంచి రూ. 2,04,30,814 కోట్లకు పెరిగింది. అంతర్జాతీయంగా ప్రధా మార్కెట్లు సానుకూలంగా కొనసాగుతుండటమే మార్కెట్ల ర్యాలీ కారణమని నిపుణులు అభిప్రాయపడ్డారు. అలాగే, అమెరికా ఫెడ్ సహా ప్రపంచవ్యాప్తంగ ప్రధాన సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను చారిత్రక కనిష్ఠానికి తగ్గించడ, రిటైల్ మదుపర్లు రికార్డు స్థాయిలో పెరగడం మార్కెట్ల దూకుడుకు కారణంగా వారు అంచనా వేశారు.


Next Story

Most Viewed