వారి పురీషనాళామే ఓ బంగారం గని

by  |
వారి పురీషనాళామే ఓ బంగారం గని
X

దిశ, వెబ్‌డెస్క్: బంగారం దొంగలు అక్రమ సొమ్ము కోసం కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. బంగారాన్ని లిక్విడ్ రూపంలో తయారు చేసి మానవ శరీరంలో ప్రైవేట్ భాగాల్లో భద్రపరుస్తున్నారు. ఇలా దాచిపెట్టి స్మగ్లింగ్‌కు యత్నించిన నిందితులను కస్టమ్స్ అధికారులు గుర్తించారు.

చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు గుండా అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారని అధికారులకు సమాచారం అందింది. దీంతో అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేశారు. ముగ్గురి కదలికలు మరింత అనుమానంగా ఉండడంతో వారిని పరిశీలించారు. అయినా బంగారం బయటపడలేదు. దీంతో పెద్ద పేగు కింద కాసింత ఒత్తి చూడగా చిన్న చిన్న ట్యూబుల ఆనవాల్లు కనబడ్డాయి. దీంతో ఎయిర్‌పోర్టు ఆస్పత్రిలోకి తీసుకెళ్లి క్షుణ్ణంగా చూడగా.. పురీషనాళాల్లో ఏకంగా 2.88 కిలోల బంగారం బయటపడింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు బంగారం ఎక్కడి నుంచి తెచ్చారని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed