ఆల్‌టైమ్ గరిష్ఠాల వద్ద క్రిప్టోకరెన్సీ ధరలు

by  |
bitcoin1
X

దిశ, వెబ్‌డెస్క్: క్రిప్టో కరెన్సీ ధరలు మరోసారి ఆల్‌టైమ్ గరిష్ఠాలకు చేరుకున్నాయి. గత వారం ధరల ర్యాలీ కొనసాగిస్తూ అంతర్జాతీయంగా క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.48 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. గత 24 గంటల్లో క్రిప్టో కరెన్సీ మార్కెట్ విలువ 4.52 శాతం వృద్ధితో 132.29 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇదే సమయంలో బిట్‌కాయిన్ ధర ప్రస్తుతం 61,348 డాలర్ల వద్ద కొనసాగుతోంది. గతవారం బిట్‌కాయిన్ ధర ఆరు నెలల్లో మొదటిసారిగా 60,000 డాలర్లను అధిగమించింది. ఇటీవల అమెరికా రెగ్యులేటర్లు ఫ్యూచర్స్-బేస్డ్ ఎక్స్చేంజ్-ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)ను అనుమతివ్వనున్నారనే సంకేతాల మధ్య ధర భారీగా పెరిగింది. ఇక, అంతర్జాతీయంగా అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయి 64,895 వద్ద ట్రేడయింది. ప్రస్తుతం 61,346 వద్ద ఉండగా, ఇది 2020 సెప్టెంబర్ 20తో పోలిస్తే 50 శాతం వృద్ధి సాధించింది.


Next Story

Most Viewed