గన్‌తో కాల్చుకుని CRPF జవాన్ ఆత్మహత్య

107

దిశ, శేరిలింగంపల్లి: మియాపూర్ నడిగడ్డ తండాలో CRPF  క్యాంప్‌లో విధులు నిర్వహిస్తున్న జవాన్ గన్‌తో కాల్చుకుని ఆత్మ‌హ‌త్యకు పాల్పడ్డాడు. మియాపూర్ పోలీస్‌ ఇన్స్ పెక్టర్ సామ‌ల వెంక‌టేశ్ తెలిపిన వివరాల ప్ర‌కారం… గుజ‌రాత్ కు చెందిన శంక‌ర్ ఠాకూర్ 2016 నుంచి మియాపూర్ న‌డిగ‌డ్డ తండాలో ఉన్న సీఆర్‌ పీఎఫ్ క్యాంపులో విధులు నిర్వ‌హిస్తున్నాడు. బుధ‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల ప్రాంతంలో శంక‌ర్ ఠాకూర్ త‌న వ‌ద్ద ఉన్న‌ ఎస్ ఎల్ ఆర్ రైఫిల్‌ తో త‌న‌కు తానే ఫైర్ చేసుకున్నాడు.

ఈ ఘటనలో శంకర్ ఠాకూర్ గొంతు భాగం నుంచి తూటా త‌ల‌ లోపలికి దూసుకుపోవ‌డంతో అక్క‌డిక‌క్క‌డే మృతిచెందాడు. ఈ మేర‌కు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. శంక‌ర్ ఠాకూర్ కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకోవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..