- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్‌డెస్క్: తన బిడ్డను కోల్పోయాననే పగతో అభం శుభం తెలియని చిన్నారిని హతమార్చింది ఓ మహిళ. చంపడమే కాక ఆ చిన్నారి శవాన్ని తన ఇంట్లోని వాషింగ్ మెషీన్లో దాచిపెట్టి ఏమీ తెలియనట్లు నటించింది. కానీ పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు (Tamilanadu)లోని తిరునెల్వేలిలో ఆతుకురిచ్చి గ్రామంలో తంగమ్మాళ్ (40) అనే మహిళ నివశిస్తోంది. కొన్నాళ్ల క్రితం ఓ ప్రమాదంలో ఆమె బిడ్డ (Child) మరణించింది. అయితే ఆమె బిడ్డ మరణానికి పక్కింట్లో ఉండే విఘ్నేష్ ఓ రకంగా కారణమయ్యాడు. దీంతో అతడిపై అంతులేని పగ పెంచుకున్న తంగమ్మాళ్ ఎలాగైనా ప్రతీకారం (Revenge) తీర్చుకోవాలని అనుకుంది. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం విఘ్నేష్ కుమారుడు సంజయ్ కనిపించకుండా పోయాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న సంజయ్ ఉన్నట్లుండి కనిపించకుండా పోయాడు. అంగన్‌వాడీ స్కూల్‌కి తీసుకెళ్లదామని తల్లి రమ్మ అతడికోసం వెతకగా ఎక్కడా కనిపించలేదు. ఇల్లంతా వెతికినా కనిపించకపోవడంతో భర్త విఘ్నేష్‌కు రమ్య విషయం చెప్పింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఊరంతా వెతికారు. చీకటి పడుతున్న కుమారుడు కనిపించకపోవడంతో రాధాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అలాగే సంజయ్ మిస్సింగ్ విషయంలో తంగమ్మాళ్‌పై అనుమానం ఉన్నట్లు కంప్లైంట్ (Complaint)లో పేర్కొనడంతో.. అప్రమత్తమైన పోలీసులు తంగమ్మాళ్ ఇంట్లో సోదాలు చేశారు. ఈ సోదాల్లో ఆమె ఇంట్లోని వాషింగ్ మెషిన్ (Washing Mechine)లో బాలుడు సంజయ్ మృతదేహం కనిపించింది. చిన్నారిని ఓ గోనె సంచిలో చుట్టి ఆ తర్వాత వాషింగ్ మెషిన్‌లో దాచింది తంగమ్మాళ్. పోలీసులు మృతదేహాన్ని (Dead Body) స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం (Postmortom) కోసం తరలించారు.
అయితే బిడ్డ చనిపోయినప్పటి నుంచి తంగమ్మాళ్ మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పలువురు అనుమానిస్తున్నారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే.. పగ మనిషిని ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా చేస్తుంది. ఎంతటి పాపం చేయడానికైనా ప్రోత్సహిస్తుంది అనే విషయం మరోసారి రుజువైంది.






