- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకుల దుర్మరణం.
44వ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంను వెనకాల నుండి

దిశ,చిన్నశంకరంపేట: 44వ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంను వెనకాల నుండి లారీ ఢీకొట్టగా అక్కడికక్కడే దుర్మరణం పాలైన సంఘటన మంగళవారం చేసుకుంది. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన దొంతి బూదయ్య ( 75).కుమారుడు దొంతి మల్లేశం. (35). లు మంగళవారం బూదయ్య ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆసుపత్రికి బైక్ మీద వెళ్తున్నారు. మాసాయిపేట మండలం రామంతాపూర్ వద్ద 44వ జాతీయ రహదారిపై నుండి చేగుంట నుండి తూప్రాన్ వైపు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని వెనకాల నుండి అతివేగంగా వస్తు లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది.దీంతో బైక్ పై ఉన్న తండ్రి కొడుకులు రోడ్డుపై పడగా, వీరి నుంచి లారీ వెళ్లగా అక్కడికక్కడే మృతి చెందగా, తండ్రి బూదయ్య తీవ్ర గాయాలయ్యాయి. దీంతో 108 వాహనంలో తూప్రాన్ ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతునికి భార్య మౌనిక రెండేళ్ల కూతురు కలదు. చేగుంట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.






