- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయనగరం ఉగ్రపేలుళ్ల కేసు..వెలుగులోకి సంచలన విషయాలు
విజయనగరం ఉగ్రపేలుళ్ల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిరాజ్ పై 6 నెలలుగా ఎన్ఐఏ, తెలంగాణ కౌంటర్ ఇంటిలిజెన్స్ అధికారులు కన్నేసినట్టు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం ఉగ్రపేలుళ్ల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిరాజ్ పై 6 నెలలుగా ఎన్ఐఏ, తెలంగాణ కౌంటర్ ఇంటిలిజెన్స్ అధికారులు కన్నేసినట్టు తెలుస్తోంది. మూడు నెలలుగా విజయనగరంలోనే సిరాజ్ మకాం వేసినట్టు తెలిసింది. సిరాజ్ బీటెక్ చదువుతున్న సమయంలోనే ఉగ్రవాద భావజాలనికి ఆకర్షితుడైనట్టు విచాణలో తేలింది. ఆ తరవాత కోచింగ్ పేరుతో హైదరాబాద్ వెళ్లి అక్కడ ఉగ్రవాదులకు దగ్గరైనట్టు తేలింది. సిరాజ్ పాకిస్థాన్ తీవ్రవాదులపై పాజిటివ్‌గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో అతడిపై ఇంటిలిజెన్స్ నిఘా పెట్టింది.
అతడు పూర్తిగా ఉగ్రవాదిగా మారి పేలుళ్లకు ప్రయత్నిస్తున్న సమయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సిరాజ్ ఆన్లైన్ ద్వారా బాంబు పేలుళ్లకు సంబంధించిన పదార్థాలను ఆర్డర్ చేసుకున్నట్టు విచారణలో తెలిసింది. ఐఈడీ బాంబు తయారీకి ముందు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌కు సమాచారం ఇచ్చి సిరాజ్‌ను అరెస్ట్ చేసినట్టు సమాచారం. సిరాజ్ అరెస్ట్ వ్యవహారంలో తెలంగాణ కౌంటర్ ఇంటిలిజెన్స్ కీలక పాత్ర పోశించింది. మరోవైపు సిరాజ్‌కు ఇల్లు అద్దెకు ఇచ్చిన వ్యక్తి పరార్ అయ్యారు. దీంతో సిరాజ్ వ్యవహారం తెలిసే ఆ వ్యక్తి ఇల్లును అద్దెకు ఇచ్చాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం సిరాజ్ రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నాడు. సిరాజ్‌కు సంబంధించిన అకౌంట్లు అన్నీ తీసుకుని ఇంటిలిజెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు.






