దేశంలో సంచలనం.. కేంద్రమంత్రి మనుమరాలు దారుణ హత్య

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-09 13:37:41  IST  )

బిహార్‌(Bihar)లోని గయలో దారుణ ఘటన చోటుచేసుకున్నది. కేంద్రమంత్రి మాంఝీ(Jitan Ram Manjhi) మనవరాలు సుష్మ దారుణ హత్యకు గురైంది.

దేశంలో సంచలనం.. కేంద్రమంత్రి మనుమరాలు దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్‌(Bihar)లోని గయలో దారుణ ఘటన చోటుచేసుకున్నది. కేంద్రమంత్రి మాంఝీ(Jitan Ram Manjhi) మనవరాలు సుష్మ దారుణ హత్యకు గురైంది. సుష్మను స్వయంగా ఆమె భర్త రమేషే కాల్చి చంపాడు. భార్యాభర్తల మధ్య చోటుచేసుకున్న గొడవలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా.. 14 ఏళ్ల క్రితం కేంద్రమంత్రి మాంఝీ మనుమరాలు సుష్మ ప్రేమించి రమేష్ అనే అతన్ని కులాంతర వివాహం చేసుకున్నది. ప్రస్తుతం బిహార్‌లోని గయా జిల్లా టెటువా గ్రామంలో వీరు నివిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గతకొన్ని రోజులుగా వీరి దాంపత్య జీవితంలో గొడవలు ప్రారంభమైనట్లు సమాచారం. ఇవాళ ఆ గొడవలు మరింత ముదరడంతో ఆగ్రహాన్ని ఆపుకోలేకపోయిన సుష్మ భర్త రమేష్.. ఇంట్లో దాచుకున్న గన్‌తో పట్టపగలు అందరూ చూస్తుండగానే కాల్చి చంపాడు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న రమేష్ కోసం బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story