- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీర్‌పేట్‌లో దారుణం.. అనుమానంతో భార్య ప్రాణాలు తీసిన భర్త
భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానంతో భర్త కత్తితో భార్యను అతి దారుణంగా హత్య చేసిన ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

దిశ, మీర్ పేట్ : భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానంతో భర్త కత్తితో భార్యను అతి దారుణంగా హత్య చేసిన ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా, మర్రిగూడెం మండలం శివన్న గూడెంకు చెందిన భర్త నరసింహ (60) భార్య వసంతలు ఒక కుమారుడు, ఒక కూతురుతో కలిసి బ్రతుకు దెరువు కోసం హైదరాబాద్ వచ్చి బీఎన్ రెడ్డి నగర్ టీచర్స్ కాలనీ నివాసముంటున్నారు. భార్య వసంత వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త నరసింహ అనుమానంతో బుధవారం తెల్లవారుజామున సమయంలో గొడ్డలితో మెడపై అతి కిరాతకంగా పొడిచి హత్య చేశాడు. తీవ్ర రక్తస్రావం జరిగి మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






