జీతం ఇవ్వని హోటల్​ యజమాని.. ఆత్మహత్య చేసుకున్న వలస కూలీ..

by Disha Web Desk 20 |
జీతం ఇవ్వని హోటల్​ యజమాని.. ఆత్మహత్య చేసుకున్న వలస కూలీ..
X

దిశ, పరిగి : తనకు ఆరోగ్యం బాగోలేదని తమ గ్రామానికి వెళ్లాలని పనిచేసిన కూలీ డబ్బులు ఇవ్వమని వలస కూలి డబ్బులు అడిగతే హోటల్ యజమానికి ఇవ్వకపోవడంతో కూలీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరిగి ఎస్సై పి.విఠల్​ రెడ్డి తెలిపిన విరవాల ప్రకారం పరిగిలోని కోడంగల్​ చౌరస్తా సమీపంలోని శ్రీ​ పుడ్​ ఫ్యాక్టరీలో పశ్చిమ బెంగాల్​ రాష్ర్టం భరతమానే జిల్లా కాత్వాకాజే మండలం సనెరం మాత పాడ గ్రామానికి చెందిన బిపాల్​ హజ్ర (26) కొంతకాలంగా పనిచేస్తున్నాడు. బిపాల్​ హజ్రకు పదిహేను రోజులుగా ఆరోగ్యం బాగోలేదని తాను తన స్వగ్రామానికి వెళ్లేందుకు తాను పనిచేసిన కూలీ డబ్బులు (జీతం ) కావాలని శ్రీ పుడ్​ ఫ్యాక్టరీ హోటల్​ యజమాని, నిర్వాహుడు శ్రీకాంత్​ రెడ్డిని అడిగాడు. ఇందుకు శ్రీకాంత్​ రెడ్డి ఇంకా నెల పూర్తికాలేదని మధ్యలో జీతం డబ్బులు ఇవ్వను అని చెప్పాడు.

దీంతో బిపాల్​ హజ్ర తనను పనిలో పెట్టిన టేకేదార్​ కు ఫోన్​ చేసి తన ఆరోగ్యం బాగోలేదని తాను తమ రాష్ట్రానికి వెళ్తాను డబ్బులు కావాలని అడిగాడు. దీనికి టేకేదార్​ కూడా బిపాల్​ హజ్రకు డబ్బులు ఇవ్వలేదు. ఇటు ఆరోగ్యం బాగోలేదని శ్రీ పుడ్​ ఫ్యాక్టరీ వాళ్లు, అటు టేకేదార్​ ఇద్దరూ డబ్బులు ఇవ్వడం లేదని ఎలా చేయాలంటూ మనోవేధనకు గురయ్యాడు. తాను పనిచేస్తున్న శ్రీ పుడ్​ ఫ్యాక్టరీ పైన తాను ఉండే గదిలో పెంట్​ హౌజ్​ పైకి ఎక్కే నిచ్చనకు టవల్​ తో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బిపాల్​ హజ్ర స్నేహితుడు సందీప్​ బిస్వాల్​ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పి.విఠల్​ రెడ్డి తెలిపాడు. పరిగిలోని పలు హోటళ్లు, ఇతర పనుల్లో పనిచేస్తున్న వలస కార్మికులు, కూలీలకు పనిచేసిన డబ్బులు సక్రమంగా ఇవ్వకుండా వేధిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి.

Next Story