విదేశాల్లో ఎంజాయ్ చేస్తూ ట్రాపిక్ SI కుమారుడు మృతి

by Disha Web Desk 7 |
విదేశాల్లో ఎంజాయ్ చేస్తూ ట్రాపిక్ SI కుమారుడు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో చాలా మంది గుండె పోటుతో మృతి చెందుతున్నారు. ఈ గుండె పోటు అనేది చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరిని బలితీసుకుంటుంది. అప్పటి వరకు అందరితో మాట్లాడుతూ.. నవ్వుతూ ఉన్న వ్యక్తలు సడెన్‌గా కుప్పకూలి మృత్యు ఒడిలోకి చేరుకుంటున్నారు. ఇలాంటి విషాదమే తాజాగా జరిగింది. అప్పటివరకు ఫ్రెండ్స్‌తో సరదాగా బీచ్‌లో ఎంజాయ్ చేసిన విద్యార్ధి గుండెపోటుతో మరణించాడు. వివరాల్లోకి వెళితే..

ఖమ్మం జిల్లాకు చెందిన ట్రాఫిక్ ఎస్సై రవికుమార్ పెద్దకుమారుడు శివరామకృష్ణ (20) కరేబియన్ దీవుల్లోని బారబడోస్‌లో MBBS సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి మంగళవారం సరదాగా బీ‌చ్‌కు వెళ్లిన అతడు.. ఈత కొట్టి వచ్చిన కొద్ది సేపటికే గెండెపోటుతో కప్పకూలిపోయాడు. స్రేహితులు ఆ విద్యార్ధిని హాస్పిటల్‌కు తరలించే లోపే ప్రాణాలు విడిచాడు. MBBS విద్యార్ధి అకాల మరణంతో ఖమ్మంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


Next Story

Most Viewed