Kidnap: ప్రభుత్వాసుపత్రిలో మూడేళ్ల బాలుడి కిడ్నాప్.. కొనసాగుతోన్న సెర్చ్ ఆపరేషన్

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-06 04:27:46  IST  )

అభంశుభం తెలియని మూడేళ్ల బాలుడు కిడ్నాప్ (Kidnap) ఘటన నల్లగొండ జిల్లా (Nalgonda) కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Kidnap: ప్రభుత్వాసుపత్రిలో మూడేళ్ల బాలుడి కిడ్నాప్.. కొనసాగుతోన్న సెర్చ్ ఆపరేషన్
X

దిశ, వెబ్‌డెస్క్: అభంశుభం తెలియని మూడేళ్ల బాలుడు కిడ్నాప్ (Kidnap) ఘటన నల్లగొండ జిల్లా (Nalgonda) కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే. గత మూడేళ్లుగా భార్యభర్తలు వారి కుమారుడితో కలిసి నల్లగొండ జిల్లా (Nalgonda District) కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి (Government Hospital) ఆవరణలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి ఈనెల 4న మధ్యాహ్నం సమయంలో ఆసుపత్రిలో ఆవరణలో ఆడుకుంటున్న బాలుడిని ఓ దుండగుడు గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్లాడు. అయితే, తమ కుమారుడు కనిపించడం లేదంటూ కంగారుతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌ (Police Station)లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా దుండగుడు బాలుడిని ఎత్తుకెళ్తున్న దృశ్యాలు ప్రభుత్వాసుత్రి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో (CC Cameras) స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ఈ మేరకు బాలుడి ఆచూకీ కనిపెట్టేందుకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపినట్లుగా తెలుస్తోంది.

Next Story